Kia India: భారత్‌లో పేరు మార్చుకున్న ‘కియా మోటార్స్’.. ఇకనుంచి ఏమని పిలవనున్నారంటే?
Kia Motors India is now Kia India: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్.. భారత్‌లోకి అడుగుపెట్టిన రెండేళ్లలోపే అగ్రగామి
Kia Motors India is now Kia India: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్.. భారత్‌లోకి అడుగుపెట్టిన రెండేళ్లలోపే అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో కియా మోటార్స్ భారత్‌లో తన కంపెనీ పేరును మార్చింది. కియా మోటార్స్‌ను ఇకపై ‘కియా ఇండియా’గా మారుస్తున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త పేరు కంపెనీ బ్రాండ్‌కు మరింత గుర్తింపు తెచ్చి పెడుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. దీర్ఘకాలంలో కంపెనీకి ఉన్నతికి సైతం తోడ్పడుతుందని కియా మోటార్స్ పేర్కొంది.
కార్పొరేట్ మంత్రిత్వ శాఖ గుర్తించిన కియా మోటార్స్ స్థానంలో ఇకపై ‘కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’గా వ్యవహరించనున్నట్లు ప్రకటనలో వెల్లడించిది. ఈ మేరకు కియా సంస్థ.. ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని కంపెనీ తయారీ పరిశ్రమలో లోగో, పేరులో మార్పులు చేసింది. డీలర్‌షిప్ కేంద్రాల వద్ద కూడా దశలవారీగా మార్పులు చేయనున్నట్లు కియా వెల్లడించింది. దేశంలో ఏడాదిన్నరగా కార్ల విక్రయాలు చేపడుతున్న కియా మోటార్స్.. అనతికాలంలోనే దేశంలో నాలుగో అతిపెద్ద కార్ల విక్రయదారుగా అవతరించింది.
Also Read: