రష్యాలో భారీ భూకంపం.. 7.8 తీవ్రతతో కంపించిన భూమి.. సునామీ హెచ్చరిక జారీ
రష్యాలో భారీ భూకంపం సంభవించింది .దీంతో అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కమ్చట్కా ద్వీపం సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రష్యాలో భారీ భూకంపం సంభవించింది .దీంతో అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కమ్చట్కా ద్వీపం సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫర్నిచర్, కార్లు, లైట్లు తీవ్రంగా వణుకుతున్నట్లు కనిపించింది.
వారం క్రితం కూడా రష్యాలో బలమైన భూకంపం సంభవించింది. తాజాగా పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్‌స్కీ రీజియన్‌లో గురువారం (సెప్టెంబర్ 18) అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించింది దీంతో యూఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కేంద్రం 10 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం 5.8 తీవ్రతతో పలు చోట్ల భూమి కంపించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనట్లు సమాచారం. తూర్పు తీరం వెంబడి సునామీ ముప్పు పొంచి ఉందని కామ్చాట్‌స్కీ ప్రాంత గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. భూకంపం గురించి స్థానిక నివాసితులను అప్రమత్తం చేశామని ఆయన అన్నారు. ముఖ్యంగా, ప్రస్తుతానికి ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Check-in counter SHAKES at airport in Kamchatka
Emergency services on FULL alert
Three magnitude 5+ AFTERSHOCKS recorded off eastern coast https://t.co/ivXwIjUvoa pic.twitter.com/pwuWE6T4mU
— RT (@RT_com) September 18, 2025
రష్యాలోని కామ్చాట్‌స్కీలో గతంలో కూడా భూకంపాలు సంభవించాయి. శనివారం (సెప్టెంబర్ 13) 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది , దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం , కమ్చట్కా ప్రాంతం పరిపాలనా కేంద్రమైన రష్యన్ నగరం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీకి తూర్పున 111 కిలోమీటర్ల (69 మైళ్ళు) దూరంలో 39.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది .
A powerful #earthquake of 7.8 is recorded in #Kamchatka, #Russia, so authorities have issued a tsunami alert for the region and in #Alaska pic.twitter.com/KTDdCDjl50
— Devesh , वनवासी (@Devesh81403955) September 19, 2025
రష్యాలోని కామ్చాట్‌స్కీ, భూకంపాలకు గురయ్యే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఈ నెలలో (సెప్టెంబర్ 2025) ఇప్పటికే మూడు భూకంపాలు సంభవించాయి. సెప్టెంబర్ 15న కామ్చాట్‌స్కీలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 13న 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూలైలో కూడా అనేక భూకంపాలు సంభవించాయి. జూలై 30న 8.8 తీవ్రతతో భూకంపం, జూలై 20న 7.4 తీవ్రతతో భూకంపం సంభవించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
