Hindu Temple In Pakistan: పాకిస్తాన్ నడిబొడ్డున హిందూ దేవాలయం.. ఎట్టకేలకు అనుమతించిన ఆదేశ ప్రభుత్వం..
పాకిస్తాన్ నడిబొడ్డున హిందూ దేవాలయం నిర్మితం కానుంది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణం త్వరలో జరగనుంది. ఆలయ నిర్మాణానికి సంబంధించి పనులను అక్కడి
HINDU TEMPLE IN PAKISTAN: పాకిస్తాన్ నడిబొడ్డున హిందూ దేవాలయం నిర్మితం కానుంది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణం త్వరలో జరగనుంది. ఆలయ నిర్మాణానికి సంబంధించి పనులను అక్కడి హిందువులు ప్రారంభించనున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్‌లో హిందువులు మైనార్టీలుగా గుర్తించడుతారు. అయితే ఆరు నెలల క్రితం ఇస్లామాబాద్‌లో అక్కడి హిందువులు శ్రీకృష్ణుడికి ఆలయాన్ని నిర్మించతలపెట్టారు. అయితే రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఈ ఆలయ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దాంతో ఆలయ నిర్మాణానికి ఆ దేశ ప్రభుత్వం అంగీకరించలేదు.
పైగా పాకిస్తాన్‌లో ఎలాంటి హిందూ ఆలయాలను నిర్మించరాదంటూ సీఐఐ ఫత్వా జారీ చేసింది. ఫలితంగా ఆ ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తాజాగా మైనారిటీలు తమ సొంత ప్రార్థనా స్థలాలను కలిగి ఉండేందుకు ఇస్లామిక్ చట్టాలు అంగీకరిస్తున్నాయంటూ కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) ప్రకటించింది. ఆ ప్రకటన నేపథ్యంలో స్పందించిన పాకిస్తాన్ ప్రభుత్వం.. శ్రీకృష్ణుడికి దేవాలయం నిర్మించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆలయ నిర్మాణ పనులకు మళ్లీ ప్రాణమొచ్చింది. కాగా, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్షాఫ్‌లో హిందూ సభ్యుడిగా ఉన్న లాల్‌చంద్ మాల్షి ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా, పాకిస్తాన్‌లో కృష్ణుడి ఆలయం నిర్మాణం పట్ల అక్కడి హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.