‘స్ట్రెయిన్’ వైరస్‌పై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచన..
New COVID-19 Strain: కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాల మీద రూపు మార్చుకున్న కరోనా వైరస్ వార్త పిడుగులా పడింది.
New COVID-19 Strain: కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాల మీద రూపు మార్చుకున్న కరోనా వైరస్ వార్త పిడుగులా పడింది. స్వతహాగా తన రూపు మార్చుకునే స్వభావం కలిగిన కోవిడ్-19, యూకేలో మరింత వేగంగా వ్యాపించే లక్షణాలతో రూపాంతరం చెంది విరుచుకుపడింది. (New Covid 19 Strain More Contagious)
బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌పై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ‘స్ట్రెయిన్’ వైరస్ విషయం తెలిసిన వెంటనే యూరప్‌లోని అనేక దేశాలు యూకేతో రాకపోకలు నిలిపేస్తున్నట్లు వెల్లడించాయి. అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న భారతదేశం కూడా నేటి అర్థరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకు బ్రిటన్ విమానాలను రద్దు చేసింది. (New Covid 19 Strain In UK)
ఇదిలా ఉంటే తాజాగా కొత్తరకం కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ‘స్ట్రెయిన్’ వైరస్ గురించి పూర్తి సమాచారం తెలిసే దాకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రిటన్ వైద్యాధికారులతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు చేస్తున్న పరిశోధనలు, విశ్లేషణపై సమాచారాన్ని పొందుతున్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా ప్రభుత్వాల సూచనలు మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. (New Covid 19 Strain Symptoms)