AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం పుట్టిన రోజున వైసీపీ శ్రేణుల భారీ రక్తదాన శిబిరాలు.. బద్దలైన గిన్నిస్ రికార్డు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు కొందరు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఏపీ సీఎం పుట్టిన రోజున వైసీపీ శ్రేణుల భారీ రక్తదాన శిబిరాలు.. బద్దలైన గిన్నిస్ రికార్డు.
Narender Vaitla
|

Updated on: Dec 21, 2020 | 10:23 PM

Share

Blood camp break record on jagan b.day: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు కొందరు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రక్తదాన కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది. 175 నియోజకవర్గాల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 18 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దీంతో గతంలో ఉన్న 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ బద్దలైంది. ప్రస్తుతం ఈ రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది. కరోనా నేపథ్యంలో ల్యాబ్‌ల్లో బ్లడ్ కొరత కనిపించిందని, అందుకే పెద్ద ఎత్తున రక్తదానం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి.. ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటదని ఆయన తెలిపారు.