అమెరికా తరువాత ఫైజర్ వ్యాక్సిన్ కి ఈయూ ఆమోదం, తాజా డేటా సమర్పణకై సూచన, ఇక 27 దేశాల్లో వినియోగం
అమెరికా తరువాత ఫైజర్, బయో ఎన్ టెక్ కోవిడ్ వ్యాక్సిన్ కి యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపింది. 16 ఏళ్ళు పైబడిన ప్రతివారికీ ఈ టీకామందు ఇవ్వాలని యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ సిఫారసు చేసింది.
అమెరికా తరువాత ఫైజర్, బయో ఎన్ టెక్ కోవిడ్ వ్యాక్సిన్ కి యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపింది. 16 ఏళ్ళు పైబడిన ప్రతివారికీ ఈ టీకామందు ఇవ్వాలని యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ సిఫారసు చేసింది. అలాగే వచ్ఛే సంవత్సరానికి గాను మీ వ్యాక్సిన్ పై ఫాలో అప్ డేటాను సేకరించి ఇవ్వాలని సూచించింది.కోవిడ్ ను అదుపు చేయాలన్న మా నిర్ణయానికి అనుగుణంగా ప్రజలందరినీ సురక్షితంగా ఉంచేందుకు రెగ్యులేటరీ తెలిపిన ఆమోదం పట్ల యూరోపియన్ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. అయితే కొన్ని షరతులతో ఈ వ్యాక్సిన్ ఆమోదానికి నోచుకుంది. 16 ఏళ్ళ లోపు పిల్లలకు దీన్ని ఇవ్వరాదని రెగ్యులేటరీ సూచించడం విశేషం. ఈయూ లోని 27 సభ్య దేశాలన్నింటిలో ప్రాణ రక్షణ మందులు, వ్యాక్సిన్ల వినియోగం, అమ్మకానికి కూడా రెగ్యులేటరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాలు కూడా ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలిపాయి.
బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ వ్యాప్తితో వ్యాప్తితో ఈ దేశాలన్నీ బెంబేలు చెందుతున్నాయి. అందువల్లే హడావుడిగా టీకామందుకు అనుమతులిస్తున్నాయి.