ఐపీఎల్‌-14 సీజన్‌లో పది జట్లు కాదు ఎనిమిదే.. కొత్త జట్ల చేరికకు పాత ఫ్రాంచైజీల అసహనం..!

ఐపీఎల్​-14వ సీజన్​లో మరో రెండు జట్లు కొత్తగా చేరతాయాంటూ పెద్ద ప్రచారం నడుస్తోంది. దీంతో మరింత జోష్ వస్తుందని అంతా అనుకుంటుండగా.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌-14 సీజన్‌లో పది జట్లు కాదు ఎనిమిదే.. కొత్త జట్ల చేరికకు పాత ఫ్రాంచైజీల అసహనం..!
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 22, 2020 | 9:42 AM

ఐపీఎల్​-14వ సీజన్​లో మరో రెండు జట్లు కొత్తగా చేరతాయాంటూ పెద్ద ప్రచారం నడుస్తోంది. దీంతో మరింత జోష్ వస్తుందని అంతా అనుకుంటుండగా.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది కూడా ఇప్పుడున్న ఎనిమిది జట్లతోనే టోర్నీ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు జట్ల చేరికపై పలు ఫ్రాంచైజీలు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. బీసీసీఐ కొత్త జట్ల నిర్ణయాన్ని కొంత కాలం వాయిదా వేయాలని అనుకుంటోంది.

డిసెంబర్​ 24న అహ్మదాబాద్​లో జరిగే సాధారణ వార్షిక సమావేశంలో ఈ మేరకు బీసీసీఐ  ఫైనల్ నిర్ణయాన్ని వెల్లడించనుంది. బోర్డు గనుక వచ్చే ఏడాది 8 జట్లతోనే ఐపీఎల్​ టోర్నీ నిర్వహిస్తే.. 14వ సీజన్​కు ముందు భారీ వేలం నిర్వహించాల్సి ఉంటుంది.

దానివల్ల తమకు జట్టు యాజమాన్యాలు తమకు ఇష్టమైన ఆటగాళ్లను కోల్పోకుండా ఉండేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం లభించినట్లవుతుంది. బీసీసీఐకి కూడా తన స్పాన్సర్​షిప్​ టైటిల్​ను విక్రయించేందుకు కొంత సమయం దొరుకుతుంది.

దీనికితోడు ప్రస్తుతం తుది 11 మంది ఆటగాళ్లలో నలుగురు విదేశీ క్రీడాకారులను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ ఆయా ఫ్రాంఛైజీలు ఈ విషయంలో సడలింపులు ఉండాలని కోరకుంటున్నాయి.