AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరేంద్ర మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారాన్ని అందజేసిన అధ్యక్షుడు ట్రంప్, మీ నాయకత్వానికి గుర్తింపు అని ప్రకటన

ప్రధాని మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం' లీజియన్ ఆఫ్ మెరిట్' ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందజేశారు. భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో మోదీ నాయకత్వ ప్రతిభ అసమానమని ఆయన అన్నారు.

నరేంద్ర మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారాన్ని అందజేసిన అధ్యక్షుడు ట్రంప్, మీ నాయకత్వానికి గుర్తింపు అని ప్రకటన
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 22, 2020 | 10:16 AM

Share

ప్రధాని మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం’ లీజియన్ ఆఫ్ మెరిట్’ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందజేశారు. భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో మోదీ నాయకత్వ ప్రతిభ అసమానమని ఆయన అన్నారు. కేవలం ఓ ప్రభుత్వ అధినేతకు మాత్రమే చీఫ్ కమాండ్ ఆఫ్ ది లీజియన్ అవార్డును అందజేస్తారు.  గ్లోబల్ పవర్ లో ఇండియా అత్యున్నత శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోవడంలో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మోదీ చేస్తున్న కృషి అపారమని పేర్కొన్నారు. అమెరికాలో భారత రాయబారి తరన్ జిత్ సింగ్ సంధు వైట్ హౌస్ లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రీన్ నుంచి స్వీకరించారు. మీ నాయకత్వానికి ఇది గుర్తింపు అని  ట్రంప్ అన్నట్టు రాబర్ట్ ట్వీట్ చేశారు.

కాగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు  కూడా ఈ పురస్కారాలు లభించాయి. ఆ యా దేశాల రాయబారులు వీటిని అందుకున్నారు. భారత ప్రధానికి ఇలా అవార్డు అందజేసిన దేశాల్లో అమెరికా తాజా దేశమైంది. 2016 లో సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్, అదే సంవత్సరంలో ఘాజీ ఆమిర్ అమానుల్లాఖాన్ స్టేట్ ఆర్డర్, 2018 లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు. 2019 లో యూఏఈ ఆర్డర్ ఆఫ్ ది జాయెర్ అవార్డు. అదే ఏడాది రష్యా ఆర్డర్ ఆఫ్ ఎండ్రు పురస్కారంతో బాటు ఆ సంవత్సరంలోనే మాల్దీవుల అత్యున్నత పురస్కారం కూడా లభించింది.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!