AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్‌.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు.. పేజర్‌ చూపిస్తూ షాకింగ్ కామెంట్స్!

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యూఎన్ ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. పలు దేశాల ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేయగా, నెతన్యాహు వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఏడు రంగాల్లో యుద్ధం చేస్తోందని పేర్కొంటూ, ఇరాన్, హమాస్‌లను ప్రస్తావించారు. హిజ్బుల్లా పేజర్ పేలుళ్లను గుర్తుచేస్తూ ఓ పేజర్‌ను ప్రదర్శించారు. ఈ సంఘటనలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్‌.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు.. పేజర్‌ చూపిస్తూ షాకింగ్ కామెంట్స్!
Netanyahu Brings A Pager
Balaraju Goud
|

Updated on: Sep 25, 2026 | 1:52 PM

Share

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. న్యూయార్క్‌లోని యూఎన్‌ జనరల్ అసెంబ్లీ వేదికపై ఆయన మాట్లాడుతున్న సమయంలో పలుదేశాల ప్రతినిధులు నిరసనగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో అనేక కుర్చీలు ఖాళీగా కనిపించాయి. తనను వ్యతిరేకిస్తూ వెళ్లిపోతున్న ప్రతినిధులను ఉద్దేశించి నెతన్యాహు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత మూడేళ్లుగా ఇజ్రాయెల్ ఏడు రంగాల్లో యుద్ధం చేస్తోందని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్‌తో పాటు ఇరాక్‌, సిరియాలోని మిలీషియాలు, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా మిలిటెంట్లను ఆయన ప్రస్తావించారు. ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను సమర్థిస్తూ.. ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నామని చెప్పారు.

ప్రసంగంలో నెతన్యాహు ఓ పేజర్‌ను పైకెత్తి చూపడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. 2024లో లెబనాన్‌లో హిజ్బుల్లా సభ్యుల పేజర్ల పేలుళ్లను గుర్తుచేస్తూ.. “హిజ్బుల్లాకు అవి గుర్తున్నాయా?” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్‌, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను నెతన్యాహు ఖండిస్తూ, వాటిని “అబద్ధం”గా అభివర్ణించారు. మరోవైపు ఇరాన్‌ ప్రభుత్వం పతనం సమీపంలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నెతన్యాహు ప్రసంగం సందర్భంగా జరిగిన వాకౌట్‌, ఆయన ఘాటు వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీశాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us