AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగ వేళ వంటనూనె ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. MRP తగ్గింపుపై కీలక ఆదేశాలు!

పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ముడి పొద్దుతిరుగుడు నూనెపై సుంకం సున్నాకు, సోయాబీన్, పామాయిల్‌పై 5%కి తగ్గింది. ఈ ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు చేర్చాలని, MRPలను సవరించాలని పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేసింది. ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది.

పండుగ వేళ వంటనూనె ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. MRP తగ్గింపుపై కీలక ఆదేశాలు!
Cooking Oil Price
Balaraju Goud
|

Updated on: Sep 25, 2026 | 1:11 PM

Share

పండుగ సీజన్‌ వేళ వంట నూనెల ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన ధరల ప్రభావంతో దేశీయంగా వంట నూనెల ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (BCD)ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. సెప్టెంబర్‌ 24 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి.

తాజా నిర్ణయం ప్రకారం.. ముడి పొద్దుతిరుగుడు నూనెపై BCDని 10 శాతం నుంచి పూర్తిగా సున్నాకు తగ్గించారు. అలాగే ముడి సోయాబీన్‌, ముడి పామాయిల్‌పై సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. శుద్ధి చేసిన సోయాబీన్‌, పామాయిల్‌పై BCD 32.5 శాతం నుంచి 27.5 శాతానికి, శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనెపై 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గింది.

ముడి, శుద్ధి చేసిన నూనెల మధ్య 19.25 శాతం దిగుమతి సుంక వ్యత్యాసాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దేశీయ రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు శుద్ధి చేసిన నూనెల అధిక దిగుమతులను నిరుత్సాహపరచడం దీని ఉద్దేశంగా పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు చేరేలా చూడాలని కేంద్రం వంట నూనెల పరిశ్రమలు, సంఘాలకు సూచించింది. తగ్గిన దిగుమతి వ్యయానికి అనుగుణంగా PTD, MRPలను వెంటనే సవరించాలని ఆదేశించింది.

అయితే నూనె ధరలు వెంటనే ఎంత మేర తగ్గుతాయన్నది అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు, రవాణా వ్యయాలు, రూపాయి మారకం విలువ, దేశీయ నిల్వలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల దిగుమతి సుంకం తగ్గినంత మేరకు రిటైల్‌ ధరలు కూడా తగ్గుతాయా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us