డ్యూటీ ముగించుకుని వస్తుండగా కారు ఢీ.. ఆర్ఎస్ఐ యాక్సిడెంట్‌లో వెలుగులోకి సంచలన ట్విస్ట్!
ఆదిలాబాద్ యాపల్ గూడ బెటాలియన్ లో ఆర్ఎస్ఐ రాకేష్ కారు ప్రమాదం వెనుక సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదం కాదని, అవినీతిని బయటపెట్టినందుకు ఆర్ఐ నరేష్ హత్యాయత్నం చేశారని రాకేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం యాపల్ గూడ పోలీస్ బెటాలియన్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం హత్యాయత్నం అని తేలింది. యాపల్‌గూడ బెటాలియన్‌లో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న రాకేష్ బైక్‌ను.. అదే బెటాలియన్‌లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నరేష్ కారుతో ఢీకొట్టాడు. అయితే ఈ ఘటన ప్రమాదం కాదని.. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆర్ఐ నరేష్.. ఆర్ఎస్ఐ రాకేష్ ను హత్య చేయాలని ఫ్లాన్ చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఆదిలాబాద్ యాపల్ గూడా బెటాలియన్లు జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటకు రావడానికి రాకేష్ కారణమని.. నిజాలు బయటపెడుతున్నాడని రాకేష్ పై ఆర్ఐ నరేష్ హత్యాయత్నం చేసినట్టు రాకేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీ ముగించుకుని తిరిగి బెటాలియన్ కు వెళుతుండగా పోలీసు వాహనంతో బెటాలియన్ రిజర్వ్ సిఐ నరేష్ కారుతో డీకొట్టి యాక్సిడెంట్ చేశారని ఆరోపిస్తున్నారు రాకేష్ కుటుంబ సభ్యులు.
ఇటీవల యాపల్ గూడ బెటాలియన్ లో జరిగిన అవకతవలపై 12పేజీలు లేఖను ఉన్నతాధికారులకు గుర్తు తెలియని వ్యక్తులు అందించగా.. ఆ వివరాలను ఆర్ఎస్‌ఐ రాకేష్ బయటకు లీక్ చేశారని కుట్రతో హత్యాయత్నానికి పూనుకున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాకేష్ కుటుంబ సభ్యులు. తీవ్ర గాయాలపాలైన ఆర్ఎస్ఐ రాకేష్ ను చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ అసుపత్రికి తరలించారు. బాధితుడు రాకేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ రూరల్ పోలీసులు బెటాలియన్ ఆర్ఐ నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
