AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్.. విచారణలో షాకింగ్‌ విషయాలు!

బతికున్న వ్యక్తులను చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వానికి చెందిన డిజిటల్ సంతకాల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో చేర్యాల మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన భూక్య మధు, హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్.. విచారణలో షాకింగ్‌ విషయాలు!
Siddipet Fake Death Certificate Scam
P Shivteja
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 9:09 PM

Share

సిద్దిపేట జిల్లాలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం కలకలం రేపుతోంది..బతికున్న వ్యక్తులను చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వానికి చెందిన డిజిటల్ సంతకాల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో చేర్యాల మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన భూక్య మధు, హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ ఈ-సైన్ డాంగిల్‌ను ప్రైవేటు వ్యక్తికి విక్రయం

రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన భూక్య మధు ప్రభుత్వ విధుల్లో భాగంగా తనకు అందిన ఈ-సైన్ డాంగిల్‌ను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తి అయిన రమేష్‌కు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ డిజిటల్ సంతకాల అధికారాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించే ఈ డాంగిల్‌ను రమేష్ చేతికి వెళ్లడంతో అక్రమాలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకాలను ఉపయోగించి ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..

2026 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సుమారు 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు సమాచారం. ఇందులో బతికున్న వ్యక్తుల పేర్లతోనే వారు మరణించినట్లు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి..ఈ సర్టిఫికెట్లను ఉపయోగించి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ మోసం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యుల పేర్లపై ముందుగానే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని, వారు బతికుండగానే మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు సమాచారం. అనంతరం ఆ ధ్రువీకరణ పత్రాలను ఆధారంగా చూపి బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు కాజేశారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది..ప్రభుత్వ డిజిటల్ సంతకాల దుర్వినియోగానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన మధుకు కూడా ముడుపులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడంతో చేర్యాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయం తరఫున ఎంపీఓ చేర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పంచాయతీ కార్యదర్శి భూక్య మధుతో పాటు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..నకిలీ డెత్ సర్టిఫికెట్ల తయారీ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ఎన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చేశారు? ప్రభుత్వ డిజిటల్ సంతకాలను మరెక్కడైనా దుర్వినియోగం చేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ
బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..
బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..
'శ్రీరాముడిగా' సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. కానీ..
'శ్రీరాముడిగా' సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. కానీ..
ఎర్రగా నిగనిగలాడే ఆపిల్స్ చూసి మోసపోకండి.. స్వీట్ ఆపిల్స్‌ని..
ఎర్రగా నిగనిగలాడే ఆపిల్స్ చూసి మోసపోకండి.. స్వీట్ ఆపిల్స్‌ని..
ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం
ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా? ఆరోగ్య ప్రయోజం
మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 
మధుమేహం ఉన్నా పాయసం తినొచ్చు.. ఎలాగో తెలుసా? 
 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?
 కార్తీక మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు?
Video: కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన ఏలియన్స్.. ట్రంప్ షాక్
Video: కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లిన ఏలియన్స్.. ట్రంప్ షాక్
కరోనాతో చావు అంచుల్లో.. ఆ నటుడే ఆస్పత్రికి వచ్చి రూ.లక్ష కట్టాడు
కరోనాతో చావు అంచుల్లో.. ఆ నటుడే ఆస్పత్రికి వచ్చి రూ.లక్ష కట్టాడు
ఇంటర్నెట్ ఉన్న కార్లను హ్యాక్ చేయవచ్చా? వీటితో జాగ్రత్త
ఇంటర్నెట్ ఉన్న కార్లను హ్యాక్ చేయవచ్చా? వీటితో జాగ్రత్త