Telangana: ఆ ఇంట బోసిపోయిన నవ్వులు.. విద్యుత్ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి
Telangana: ఆడుకుంటూ అక్కడికి వెళ్లిన బాలుడు స్టీల్ ప్లేట్‌ను పట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు..

Telangana: అప్పటివరకు అల్లారుముద్దుగా ఇంట్లో తిరుగుతూ ఆడుకున్న తొమ్మిది నెలల పసిబాలుడిని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతి చెందడంతో కొనిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో విషాదం నెలకొంది. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామానికి చెందిన ఇల్లెందుల రమేష్, మమత దంపతుల తొమ్మిది నెలల కుమారుడు అవేద్ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎర్త్ పైపుపై బిగించిన స్టీల్ ప్లేట్‌కు వర్షం కారణంగా విద్యుత్ సరఫరా అయినట్లు తెలుస్తోంది.
ఆడుకుంటూ అక్కడికి వెళ్లిన బాలుడు స్టీల్ ప్లేట్‌ను పట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తొమ్మిది నెలల పసిబాలుడు మృతి చెందడంతో చిన్న మునగాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
