Protest: నిరసన కార్యక్రమంలో పాల్గొన్న యువకుడు.. ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ గార్డుని కత్తితో గాయపరచడంతో పాటు వీథిలో ఉద్రిక్తతలకు కారణమయ్యాడంటూ ఓవ్యక్తిని ఉరి తీసింది. ఆందోళనల అణిచివేతల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ గార్డుని కత్తితో గాయపరచడంతో పాటు వీథిలో ఉద్రిక్తతలకు కారణమయ్యాడంటూ ఓవ్యక్తిని ఉరి తీసింది. ఆందోళనల అణిచివేతల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గత సెప్టెంబర్‌లో హిజాబ్ ధరించలేదన్న కారణంగా మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసిన మాహ్సా అమ్ని అనే యువతి కస్టడీలో మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న పలువురు ఆందోళనకారులకు ఇరాన్ ప్రభుత్వం శిక్షలు విధించింది. ఇరాన్‌ను కుదిపేసిన ప్రజా తిరుగుబాటులో పాల్గొన్న నిరసనకారులను బెదిరించేందుకు ప్రభుత్వం నకిలీ విచారణలు చేపట్టి శిక్షలు విధిస్తోందని మండిపడింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్.
ఇరాన్ ప్రభుత్వం తక్షణమే అన్ని ఉరి శిక్షలను రద్దు చేయాలని, శాంతియుత నిరసనలలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసిన ఆందోళనకారులపై ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..