AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Women’s Day 2021 : కరోనా కల్లోలం నేపథ్యంలో ఉమెన్స్ డే వేడుక థీమ్, ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటి సారి ‘గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించడం’ థీమ్‌‌‌‌తో ఉమెన్స్ డే జరిపింది. అప్పటినుంచి ఇప్పటివరకూ మహిళలకు స్ఫూర్తి కలిగించే థీమ్స్‌‌‌‌తో...

International Women's Day 2021 : కరోనా కల్లోలం నేపథ్యంలో ఉమెన్స్ డే వేడుక థీమ్, ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..!
Surya Kala
|

Updated on: Mar 06, 2021 | 5:44 PM

Share

International Women’s Day 2021 : 1975వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ‘గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం’ అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఒకొక్క థీమ్ తో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈనేపథ్యంలో ఈ ఏడాది కూడా మహిళలు ఎదుర్కొంటున్న విజయాలు ప్రస్తావిస్తూ.. సమస్యలను ఎత్తిచూపుతూ వేడుకల్ని నిర్వహించనుంది. 2021 మార్చి 21న మహిళా దినోత్సవం COVID-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా భిన్నంమైన ఇతివృత్తాన్ని ఎంచుకుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 థీమ్ :

ఈ ఏడాది ప్రపంచాన్ని కరోనా మహమ్మారి చుట్టేసిన నేపథ్యంలో భవిష్యత్ లో ముందుకు వెళ్ళడానికి మహిళలకు నాయకత్వం ఇవ్వాలనే ఇతి వృత్తిని ఎంచుకుని ఓ ప్రణాళిక రచించింది. COVID-19 కల్లోలం నుంచి భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి.. విధాన రూపకల్పనకు సంబంధించి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మహిళలను సమాన భాగస్వాములుగా ఎలా చేయవచ్చో థీమ్ హైలైట్ చేస్తుంది. కరోనా సృష్టించిన ఆర్ధిక కల్లోలం నుంచి భవిష్యత్ వైపు అడుగులు వేయాలంటే మహిళలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. విప్లవాత్మక మార్పుల కోసం అడుగు వేయాలని తెలిపింది. మహిళల పురోగతిని నిరోధించే సాంస్కృతిక, చారిత్రక, సామాజిక-ఆర్థిక అవరోధాల అడ్డును తొలగించాలనేది ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం.

ప్రస్తుతం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, మహిళలు తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. తమ ఆరోగ్యానికి, మాన ప్రాణాలకు హాని కలిగించే పరిష్టితులున్నా మహిళలు వెరవకుండా పనిచేస్తున్నారని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ చెప్పింది. అయితే ఇటువంటి పరిస్థితుల నుంచి మహిళను కాపాడడానికి యుఎన్‌డిపి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కలిసి పని చేస్తుందని ప్రకటించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత :

మహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక విజయాలకు ప్రతీకగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. అంతేకాదు లింగ సమానత్వం కోసం పురుషులతో మహిళలకు సమానంగా హక్కులను పొందడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది చర్చించనున్నారు. మహిళల హక్కులు, లింగ సమానత్వం, భద్రత , లైంగిక శారీరక వేధింపుల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఐడబ్ల్యుడి చర్యలను సూచిస్తుంది. జీవితంలోని ప్రతి సమయంలోను మహిళలు పోషించిన అసాధారణ పాత్రలను ప్రతిబింబించడంతో పాటు.. సాధారణ మహిళల్లో దైర్యం నింపడానికి మహిళా దినోత్సవం సహాయపడుతుంది. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు గొప్ప పురోగతి సాధించినప్పటికీ.. లింగ సమానత్వం నెరవేరని కలగానే మిగిలిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉగ్యోగల్లో 2.7 బిలియన్ల మంది మహిళలను పురుషుల మాదిరిగానే ఎంపిక చేసుకోకుండా పక్కన పెట్టాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక 2019 నాటికి చట్ట సభల్లో మహిళలు అడుగు పెట్టిన సంఖ్య కూడా తక్కువే అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముగ్గు మహిళల్లో ఒకరు లింగ ఆధారిత హింసను అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటి సారి ‘గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించడం’ థీమ్‌‌‌‌తో ఉమెన్స్ డే జరిపింది. అప్పటినుంచి ఇప్పటివరకూ మహిళలకు స్ఫూర్తి కలిగించే థీమ్స్‌‌‌‌తో ఈ ఉమెన్స్‌‌‌‌ డే ను సెలబ్రేట్ చేస్తుంది. అలా రాను రాను సామా జికంగానూ, రాజకీయాల్లోనూ, ఆర్డికం గానూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.

Also Read:

ప్రపంచ వ్యాప్తంగా మొదలైన మహిళాదినోత్సవ సంబరాలు.. దీని వెనుక ఓ మహిళ కృషి పట్టుదల ఉంది ఆమె ఎవరో తెలుసా..!

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అయితే భూమి మీద 2030 నాటికి మహిళల సంఖ్య భూమిపై సగం సగం