AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre Video: 31వ తేదీ అంటే ఆమాత్రం ఉంటదబ్బా.. ఫుల్లుగా తాగి ఏం చేశాడో తెలుసా..?

ప్రపంచమే పండగ చేస్కుంది. ఆకాశమే హద్దుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. 2024 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు చెబుతూ.. 2025కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు జనం. కేక్‌లు కట్‌ చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. అయితే.. కొందరు మాత్రం ఫుల్లుగా తాగి.. తూలుతూ న్యూయర్ చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో కూడా భారీగా దొరికిపోయారు..

Bizarre Video: 31వ తేదీ అంటే ఆమాత్రం ఉంటదబ్బా.. ఫుల్లుగా తాగి ఏం చేశాడో తెలుసా..?
Viral Video
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jan 01, 2025 | 10:22 AM

Share

ప్రపంచమే పండగ చేస్కుంది. ఆకాశమే హద్దుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. 2024 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు చెబుతూ.. 2025కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు జనం. కేక్‌లు కట్‌ చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. అయితే.. కొందరు మాత్రం ఫుల్లుగా తాగి.. తూలుతూ న్యూయర్ చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో కూడా భారీగా దొరికిపోయారు.. అయితే.. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మందుబాబు హల్‌చల్ చేశాడు. మందుబాబుల్లోకెల్లా నేను వేరు అన్నట్లుగా నానా హంగామా చేశాడు.. ఏకంగా కరెంట్ పోల్ ఎక్కి వైర్లపై పడుకున్నాడు.. ఈ ఘటన కలకలం రేపింది.

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగుపురంలో మంగళవారం మందుబాబు హల్చల్ చేశాడు. మద్యంకి డబ్బులు ఇవ్వలనీ తన తల్లిపై ఒత్తిడి తెస్తూ కరెంట్ ఫోల్ ఎక్కి విద్యుత్ వైర్లపై వీరంగం సృష్టించాడు. విద్యుత్ వైర్లపై అడ్డంగా పడుకుని నానా రభస సృష్టించాడు యజ్జల వెంకన్న అనే మందుబాబు..

వీడియో చూడండి..

వృద్దురాలైన తన తల్లికి నిన్ననే పింఛన్ అందటంతో తల్లికి డబ్బులు అడిగాడు వెంకన్న.. అయితే.. డబ్బులు ఇస్తే మద్యం తగుతాడని డబ్బులు ఇవ్వనని తల్లి చెప్పింది.. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకన్న కరెంట్ ఫోల్ పైకెక్కి వీరంగం సృష్టించాడు. అయితే వెంటనే గ్రామస్తులు వెంకన్న ప్రవర్తనను గమనించి విద్యుత్ DP స్విచ్ ఆఫ్ చేసి పవర్ సప్లైని ఆపివేసారు. దీంతో ప్రాణహాని తప్పింది.

సుమారు అర్ధ గంటకు పైగా వెంకన్న కరెంట్ ఫోల్ పైన హల్చల్ చేశాడు. తన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కిందకు దిగిరమ్మని కోరినా చాలా సమయం వరకు దిగలేదు. చివరకు ఏదో ఒకటి చెప్పి బుజ్జగించి గ్రామస్తులు వెంకన్నను అతి కష్టం మీద కిందకు దింపగలిగారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..