వలసలతోనే అభివృద్ధి.. వలస కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక తీర్మానం.. నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

ప్రపంచమంతా ఒక గ్రామంగా మారుతున్న తరుణంలో వలస అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆర్థిక ఇబ్బందులు, చేసుకునేందుకు సరైన పని దొరక్క వలసబాట పడుతుంటారు...

  • Subhash Goud
  • Publish Date - 8:44 am, Fri, 18 December 20
వలసలతోనే అభివృద్ధి.. వలస కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక తీర్మానం.. నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

ప్రపంచమంతా ఒక గ్రామంగా మారుతున్న తరుణంలో వలస అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆర్థిక ఇబ్బందులు, చేసుకునేందుకు సరైన పని దొరక్క వలసబాట పడుతుంటారు. వలస అనేది అనాదిగా వస్తున్న ప్రస్థానం. పూర్వం ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వలస వెళ్లడం సాధారణ జరిగేవి.

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణలోకి తీసుకున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1990 డిసెంబర్‌ 18న జరిగిన సమావేశంలో వలస కార్మికులు వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్గత, అంతర్జాతీయ వలస వెళ్తున్న పౌరులందరి కోసం డిసెంబర్‌ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది.

21వ శతాబ్దంలో ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్లడం మామూలే. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. బస్సెక్కి వెళ్లొచ్చినంత సులువుగా విదేశాలు వెళ్లి రావడం , చాలా మంది విదేశాల్లో స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నారు. ఇందుకు ప్రాశ్చాత్య దేశాలు వలస పద్దతులను సరళం చేసే అవకాశాలు కల్పిస్తున్నారు. 1990 దశకంలో మొదలైన కంప్యూటరర్‌ రంగ నిపుణులతో వలసలు ఎన్నో రేట్లు పెరిగాయనే చెప్పాలి.

ఐక్యరాజ్య సమితి 1990, డిసెంబర్‌ 18న అంతర్జాతీయ వలస దారుల హక్కులను పరిరక్షించుకోవడానికి అవకాశం కల్పించింది. తర్వాత వివిధ తీర్మానాల తర్వాత 2000 సంవత్సరంలో ఈ రోజుని అంతర్జాతీయ వలసదారుల దినంగా నిర్దేశించడం జరిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో గత రెండు దశాబ్దాలుగా ముఖ్యంగా కంప్యూటరర్‌ రంగం సేవా పరిశ్రమగా తీర్చి దిద్దుతున్న భారతీయులకు, మన తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు అంది రావడం జరిగింది. ఈ రెండు దేశాల్లో ఎంతో మంది తెలుగువారు నివసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.