Coronavirus: కరోనా బారిన పడిన మరో దేశాధ్యక్షుడు.. ఏడు రోజుల పాటు స్వీయ ఐసోలేషన్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వాళ్లు వీళ్లు అనే తేడా ఏమీ లేకుండా అందరినీ తగులుకుంటుంది. తాజాగా మరో దేశాధ్యక్షుడు కరోనా..

Corona virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వాళ్లు వీళ్లు అనే తేడా ఏమీ లేకుండా అందరినీ తగులుకుంటుంది. తాజాగా మరో దేశాధ్యక్షుడు కరోనా బారిన పడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక భవనమైన ఎల్సీ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ ప్రకటన ప్రకారం.. మెక్రాన్‌కు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయన కరోనా బారిన పడినట్లు వైద్యులు తేల్చారు. అయితే కరోనా సోకిన నేపథ్యంలో మెక్రాన్ ఏడు రోజుల పాటు స్వీయ ఐసోలేషన్‌లో ఆ దేశ అధికార యంత్రాంగం తెలిపింది. అయితే, ఫ్రాన్స్ ప్రధాని జీన్ క్యాస్టెక్స్, ఇతర మంత్రులతో జరిగిన కేబినెట్ సమావేశంలో మెక్రాన్ పాల్గొన్నారు. దీంతో వారు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
Also read:
