చైనా దుశ్చర్య.. సరిహద్దులో 2000 కి.మీ గోడ నిర్మాణం.. మయన్మార్ ఆక్రమణే చైనా ఉద్దేశమంటున్న అమెరికా
ప్రపంచ దేశాన్నీ ఎంత చీదరించుకున్నా.. ఎన్ని గుణపాఠాలు చెప్పినా డ్రాగన్ దేశం మాత్రం అనుకున్నదే చేస్తుంది. చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకొని అతి పెద్దనగరంగా అవరించడమే ప్రధాన...

ప్రపంచ దేశాన్నీ ఎంత చీదరించుకున్నా.. ఎన్ని గుణపాఠాలు చెప్పినా డ్రాగన్ దేశం మాత్రం అనుకున్నదే చేస్తుంది. చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకొని అతి పెద్దనగరంగా అవరించడమే ప్రధాన ఉద్దేశం. ఇందు కోసం చైనా ఎన్నో కుట్రలకు దిగుతోంది. మయన్మార్ సరిహద్దులో ఏకంగా 2000 కిలోమీటర్ల పొడవైన గోడ నిర్మాణం చేపట్టబోతోంది. దేశంలో అక్రమంగా ప్రవేశించే వారిని నివారించేందుకు ఈ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు చైనా చెబుతుండగా, మయన్మార్ ఆక్రమణే డ్రాగన్ ముఖ్య ఉద్దేశమంటూ అమెరికా అత్యున్నత టింక్‌టాక్ వెల్లడించింది.
తన దక్షిణ సరిహద్దు మయన్మార్ వెంట రెండు వేల కిలోమీటర్ల పొడవైన ముళ్ల గోడను నిర్మించేందుకు ప్లాన్ వేస్తోంది. మయన్మార్ సైన్యం తన సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా, చైన వైఖరిని మార్చుకోకపోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈ కట్టడి శాశ్విత కట్టడం కాదు.. ముళ్ల కంచెతో ఏర్పాటు చేస్తున్న గోడ. ఈ కట్టడాన్ని మయన్మార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. ఏ మాత్రం లెక్క చేయకుండా ముందుకెళ్తోంది.
ఈ గోడను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న మయన్మార్ ఆర్మీ.. తమ నిరసన తెలుపుతూ ఓ లేఖను కూడా రాసింది. 1961లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం గురించి లేఖలో ప్రస్తావించింది. దీని ప్రకారం సరిహద్దుకు ఇరువైపులా పది మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టంగా ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 13 నుంచే చైనా ఈ ముళ్ల కంచె వేయడం ప్రారంభించినట్లు మయన్మార్ మీడియా వెల్లడించింది. అప్పటి ఒప్పంద పత్రంలో ఏమేం రాసి ఉన్నాయో మయన్మార్ పంపిన లేఖలో గుర్తు చేసింది.
