యోగాకు అరుదైన గుర్తింపు.. పోటీ క్రీడ‌గా ప్రకటించిన కేంద్ర మంత్రిత్వ‌శాఖ

భారత సాంప్రదాయ యోగాకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఇకపై యోగాను పోటీ క్రీడ‌గా గుర్తిస్తున్న‌ట్లు ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది. ఆయుష్‌తో పాటు క్రీడా మంత్రిత్వ‌శాఖ కూడా యోగాను పోటీ క్రీడ‌గా గుర్తిస్తున్న‌ట్లు వెల్లడించాయి. ఖేలో ఇండియాలో యోగాసనాల‌ను కాంపిటీటివ్ స్పోర్ట్‌గా ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్ రిజిజూ వెల్ల‌డించారు.

యోగాకు అరుదైన గుర్తింపు.. పోటీ క్రీడ‌గా ప్రకటించిన కేంద్ర మంత్రిత్వ‌శాఖ
Balaraju Goud

|

Dec 18, 2020 | 1:39 PM

భారత సాంప్రదాయ యోగాకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఇకపై యోగాను పోటీ క్రీడ‌గా గుర్తిస్తున్న‌ట్లు ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది. ఆయుష్‌తో పాటు క్రీడా మంత్రిత్వ‌శాఖ కూడా యోగాను పోటీ క్రీడ‌గా గుర్తిస్తున్న‌ట్లు వెల్లడించాయి. ఖేలో ఇండియాలో యోగాసనాల‌ను కాంపిటీటివ్ స్పోర్ట్‌గా ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్ రిజిజూ వెల్ల‌డించారు. జాతీయ క్రీడ‌లు, యూనివ‌ర్సిటీ క్రీడ‌ల్లోనూ యోగా పోటీ క్రీడ‌గా ఉంటుంద‌ని ఆయన తెలిపారు. పోటీ క్రీడ‌గా ప్ర‌క‌టించ‌డంతో.. యోగాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెర‌గ‌‌నున్న‌ట్లు ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ‌తలో ఆధ్యాత్మిక చింత‌న‌ను పెంపొందించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం.. నేష‌న‌ల్ యోగాస‌న స్పోర్ట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియాను స్థాపించింది. ఫిట్ ఇండియా ఉద్య‌మం ద్వారా యోగాను ప్ర‌మోట్ చేయ‌నున్నారు. యోగాను పోటీ క్రీడ‌గా ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉంద‌ని ఆయుష్ మంత్రిత్వ‌శాఖ మంత్రి శ్రీప‌ద్ నాయ‌క్ తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయాలని, దాన్ని క్రీడగా చూడాల‌న్న ప్ర‌ధాని మోదీ ఆకాంక్ష నెర‌వేసిన‌ట్లు మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. క్రీడా లోకానికి యోగాస‌నం ఓ గొప్ప బ‌హుమ‌తి అని మంత్రి త‌న ట్వీట్‌లో స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో యోగాను ఒలింపిక్ క్రీడల్లోనూ చూసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నిపుణులు భావిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu