ISL 2020-21: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న బెంగళూరు..క్రేజీ రికార్డ్ నెలకొల్పిన సునీల్ ఛెత్రి

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. గురువారం జీఎంసీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 2-1తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది.

ISL 2020-21: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న బెంగళూరు..క్రేజీ రికార్డ్ నెలకొల్పిన సునీల్ ఛెత్రి
Follow us

|

Updated on: Dec 18, 2020 | 1:33 PM

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. గురువారం జీఎంసీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 2-1తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో టోర్నీలో మూడో విజయాన్ని ఒడిసిపట్టింది. బెంగళూరు తరఫున సారథి‌ సునీల్‌ ఛెత్రి(38వ నిమిషం), క్లిటన్‌ సిల్వా (79వ నిమిషం) చెరో గోల్‌ చేశారు. ఒడిశా తరఫున స్టీవెన్‌ టేలర్‌(71వ నిమిషం) ఒకే ఒక్క గోల్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో తన గోల్‌తో ఐఎస్‌ఎల్‌లో 50 గోల్స్‌లో భాగస్వామి అయిన భారత తొలి ఆటగాడిగా సునీల్ ఛెత్రి నిలిచాడు. ఐఎస్‌ఎల్‌లో అతను 42 గోల్స్ సాధించగా.. మరో ఎనిమిది గోల్స్‌కు సహకారం అందించాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు మూడు విజయాలు, మూడు డ్రాలతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది.

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు