AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old World Monkey: రంగు రంగు దుస్తులను ధరించినట్లు కనిపించే కోతి.. ప్రత్యేకతలు ఏమిటంటే..

Old World Monkey: రెడ్-షాంక్డ్ డౌక్ రంగు రంగు దుస్తులను ధరించినట్లు కనిపించే కోతి. ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉన్న ఈ కోతులను..

Old World Monkey: రంగు రంగు దుస్తులను ధరించినట్లు కనిపించే కోతి.. ప్రత్యేకతలు ఏమిటంటే..
Old World Monkey
Surya Kala
|

Updated on: Oct 21, 2021 | 11:19 AM

Share

Old World Monkey: రెడ్-షాంక్డ్ డౌక్ రంగు రంగు దుస్తులను ధరించినట్లు కనిపించే కోతి. ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉన్న ఈ కోతులను “ప్రైమేట్స్ క్వీన్” గా పిలుస్తారు. ప్రపంచంలో అతి పురాతన కోతి ఇండోచైనాకు చెందింది. వియత్నాం, దక్షిణ లావోస్, ఈశాన్య కంబోడియాల్లో కూడా ఈ రెడ్-షాంక్డ్ డౌక్ కోతులు కనిపిస్తాయి. సహజంగా అడవుల్లోని చెట్లే వీటి ఆవాసాలు. ఎప్పుడైనా నీరు త్రాగడానికి లేదా ధూళిని తినడానికి నేలమీదకు వస్తాయి.

రంగు రంగుల కోతి.. నలుపు, బూడిద, తెలుపు, గోధుమ-ఎరుపు, నారింజ వంటి ఐదు రంగుల కలయికతో కనువిందు చేస్తాయి. అందుకనే ఈ కోతులను ఫైవ్-కలర్ డౌక్ ని కూడా పిలుస్తారు. కోతి పుట్టిన సమయంలో నల్లటి ముఖంతో పసుపు-గోధుమ బొచ్చుతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక 8 నెలల నుంచి 24 నెలల వయస్సు మధ్య, బొచ్చు , ముఖం రంగులు క్రమంగా మారుతూ ఎంతో అందంగా కనిపిస్తాయి. రెడ్-షాంక్డ్ డౌక్ ముంజేతులు తెల్లగా ఉంటాయి. కాళ్లపైన నల్లగా బూడిద రంగులో ఉంటాయి. కాళ్ళకు కింద ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. చేతులు, కాళ్లు నల్లగా ఉంటాయి. అదే కోతి ఎరుపు రంగులో ఉంటె.. ముఖం పసుపు-నారింజ రంగు, చెవులు అందంగా, కనురెప్పలు నీలిరంగు ఐషాడోతో వేసుకున్నట్లుగా కనిపిస్తాయి. వీటి కళ్ళు వంకాయ రంగుని కలిగి ఉంటాయి. ఈ మగ కోతులు పొడవైన, తెల్లని మీసాలతో అందమైన గడ్డంను కలిగి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ కోతులు చూడడానికి గ్రహాంతరవాసిని గుర్తు చేస్తాయి.

ఈ అందమైన రంగురంగుల రెడ్-షాంక్డ్ డౌక్ కోతులు ప్రమాదంలో ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే CITES I అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిషేధించిన జంతువులలో ఈ కోతులు ఉన్నాయి. ఇండోచైనాలో రెడ్-షాంక్డ్ డౌక్స్ ఎన్ని ఉన్నాయో లెక్కలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వియత్నాంలోని సోన్ ట్రాలో సుమారు 1300 ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి అంతరించిపోవడానికి ముఖ్య కారణం మనుషులు వేట అని తెలుస్తోంది. ఆహారంకోసం, జిగురు తయారీ కోసం ఈ కోతులను చంపుతున్నారు. అంతేకాదు అభివృద్ధి పేరుతో అడవులు అంతరించిపోవడం కూడా ఈ రెడ్-షాంక్డ్ డౌక్స్ ప్రమాదంలో పడడానికి కారణం అని తెలుస్తోంది.

Also Read: అమ్మాయిని ప్రేమించి మోసం చేశా క్షమించండి అంటున్న కిమ్ సియోన్-హో.. షోల నుంచి తొలగించిన ప్రొడక్షన్ టీం..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!