India Crosses 100 Crore Vaccines: హండ్రెడ్‌ క్రోర్స్‌.. సరిగ్గా వంద కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించిన దేశాలు ఇవే..

హండ్రెడ్‌ క్రోర్స్‌.. సరిగ్గా వంద కోట్ల నెంబర్ దాటేసింది. వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. వందకోట్ల డోసుల మైలురాయిని దాటేసింది. చైనా తర్వాత వందకోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసిన రెండో దేశంగా నిలిచింది.

India Crosses 100 Crore Vaccines: హండ్రెడ్‌ క్రోర్స్‌.. సరిగ్గా వంద కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించిన దేశాలు ఇవే..
100 Crore Covid Doses Today
Follow us

|

Updated on: Oct 21, 2021 | 1:13 PM

హండ్రెడ్‌ క్రోర్స్‌.. సరిగ్గా వంద కోట్ల నెంబర్ దాటేసింది. వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. వందకోట్ల డోసుల మైలురాయిని దాటేసింది. చైనా తర్వాత వందకోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసిన రెండో దేశంగా నిలిచింది భారత్‌. 275 రోజుల్లోనే వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడంతో.. వ్యాక్సిన్‌ వేడుకలు నిర్వహిస్తోంది కేంద్రం. ఈ సందర్భంగా ఢిల్లీ RML ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ సంబరాల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్‌ను ఓ ఉద్యమంలా చేపట్టింది కేంద్రం. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభమవగా.. ఆగస్ట్‌ 6నాటికి 50 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసింది. ఇప్పటివరకు 31 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ కంప్లీట్‌ అయింది. దేశంలో ఇప్పటివరకు బిలియన్‌ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించింది కేంద్రం.

వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డ్‌ సృష్టించామన్నారు ప్రధాని మోడీ. వ్యాక్సినేషన్‌లో ఇవాళ గోల్డెన్‌ డేగా అభివర్ణించారు. 130 కోట్ల మంది ప్రజల సమష్టి స్ఫూర్తిని చూశామన్నారు. మొదటి దశలో కొవిడ్‌ వారియర్స్‌కు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి సెకండ్‌ ఫేజ్‌లో 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ స్టాట్‌ చేశారు. ఆ తర్వాత మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ ప్రారంభంలో కొన్ని రకాల భయాలు, అపోహలతో టీకా పంపిణీ నెమ్మదిగా సాగినా..సెకండ్‌వేవ్‌ కరోనా విజృంభణతో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా రెండున్నర కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. మొత్తంగా 9 నెలల్లోనే 100 కోట్ల డోస్‌ల మార్క్‌ను అధిగమించింది భారత్‌.

తమ దేశ జనాభాలో అత్యధిక మందికి వ్యాక్సినేషన్ అందించింది మాత్రం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌. యూఏఈ జనాభాలో 96 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అందించింది. అగ్రరాజ్యం అమెరికాలో మొత్తంగా 65.1 శాతం మందికి వ్యాక్సిన్‌ అందగా.. ఇందులో 56.3 శాతం మందికి రెండు డోసులు, 8.8 శాతం మందికి ఒక్క డోసు వ్యాక్సినేషన్‌ జరిగింది. ఇక మన దేశ జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా..  20.6 శాతం మందికి రెండు డోసులు పూర్తవ్వగా, 29.6 శాతం మందికి కేవలం ఒక్కడోసు టీకా అందింది.

మన టీకా పంపిణీలో ముఖ్యమైన మైలురాళ్లు…

16-01-2021 – టీకా పంపిణీ ప్రారంభం 19-02-2021 – కోటి డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి 11-04-2021 – 10 కోట్ల డోసులు పూర్తి 12-06-2021 – 25 కోట్ల డోసులు పూర్తి 06-08-2021 – 50 కోట్ల డోసులు పూర్తి 13-09-2021 – 75 కోట్ల డోసులు పూర్తి 21-10-2021 – 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ 17-09-2021 – ఒక్కరోజు అత్యధిక వ్యాక్సినేషన్‌ (2.5 కోట్ల డోసులు) ప్రధాని మోడీ పుట్టినరోజున

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందించిన దేశాలు.. దేశం డోసుల సంఖ్య (కోట్లలో) 1. చైనా 200.3 2. భారత్‌ 100.0 3. అమెరికా 41.0 4. బ్రెజిల్‌ 25.9 5. ఇండోనేషియా 17.4 6. మెక్సికో 11.1 7. రష్యా 9.8 8. పాకిస్థాన్‌ 9.3 9. బంగ్లాదేశ్‌ 5.8 10. నైజీరియా 0.8

జనాభాపరంగా అత్యధికంగా వ్యాక్సినేషన్‌ జరిగిన దేశాలు దేశం రెండు డోసులు ఒక్క డోసు మొత్తం 1. యుఏఈ 85.6 9.9 96.0 2. పోర్చుగల్‌ 86.3 1.9 88.0 3. క్యూబా 60.0 25.8 85.8 4. చిలీ 74.8 9.1 83.9 5. స్పెయిన్‌ 79.3 1.7 81.0 6. సింగపూర్‌ 79.4 0.95 80.4 7. కంబోడియా 74.4 5.76 80.2 8. ఉరుగ్వే 74.8 4.1 79.0 9. దక్షిణకొరియా 66.7 12.1 78.9 10. కెనడా 73.0 4.7 77.8

ఇవి కూడా చదవండి: 100 Crore Vaccination: 100 కోట్ల మార్కును దాటిందోచ్.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.