Korean Drama: అమ్మాయిని ప్రేమించి మోసం చేశా క్షమించండి అంటున్న కిమ్ సియోన్-హో.. షోల నుంచి తొలగించిన ప్రొడక్షన్ టీం
Korean Drama:ఫేమస్ కొరియన్ డ్రామా 'ఛ ఛ ఛ' ఫేమ్ కిమ్ సియోన్-హో పై ఇటీవల సోషల్ మీడియాలో ప్రేమించి సహజీవనం చేసి..
Korean Drama:ఫేమస్ కొరియన్ డ్రామా ‘ఛ ఛ ఛ’ ఫేమ్ కిమ్ సియోన్-హో పై ఇటీవల సోషల్ మీడియాలో ప్రేమించి సహజీవనం చేసి ఓ యువతిని మోసం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అప్పుడు కిమ్ కు అభిమానులు అండగా నిలిచారు. మళ్ళీ కిమ్ తన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూనే అబార్షన్ చేసుకోవాలని ఫోర్స్ చేశాడనే పోస్ట్ ఈ మధ్య ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఈ ఆరోపణలపై కిమ్ సియోన్ హో స్పందిస్తూ.. మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అబార్షన్ చేసుకుంటే.. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశానని.. తన మాట నమ్మి ఆమె అబార్షన్ చేయించుకుందని ఈ విషయంలో తన మాజీ ప్రియురాలికి క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఆ యువతిని వ్యక్తిగతంగా కలిసే సమయం కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపాడు. అయితే ప్రస్తుతానికి, తాను ఈ ప్రకటన ద్వారా ఆమెకు నిజంగా క్షమాపణ చెబుతున్నానని తెలిపాడు. అజాగ్రత్త, అనాలోచిత చర్యలతో మాజీ గర్ల్ ఫ్రెండ్ ను చాలా బాధపెట్టానని కిమ్ చెప్పాడు.
చివరి వరకు నన్ను విశ్వసించి.. నాకు మద్దతు ఇచ్చిన వారందరినీ నిరాశపరిచినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ తనకు సపోర్ట్ చేసి స్టార్‌గా నిలబెట్టిన అభిమానులకు కూడా సారీ, థాంక్స్ చెప్పాడు కిమ్. నా లోపాల వలన నా సహనటులు మరియు నాతో పనిచేసిన సిబ్బందికి కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నట్లు కిమ్ చెప్పారు. కిమ్ ఈ అపాలజీ స్టేట్‌మెంట్ ఇచ్చిన కాసేపటికే.. ‘టు డేస్ అండ్ వన్ నైట్’ షో మేకర్స్ ఓ ప్రకటన చేశారు. కిమ్ సియోన్ హో ఇక నుంచి ఫోర్త్ సీజన్‌లో కిమ్ ఉండబోడని ప్రొడక్షన్ టీం ప్రకటించింది. కిమ్ సియోన్ హో నటించిన సీన్లను ఎడిట్ చేస్తామని ప్రకటించింది.
కిమ్ సియోన్-హో అనేక షో లతో పాటు గుడ్ మేనేజర్, టూ కాప్స్, మంచి మేనేజర్, 100 డేస్ మై ప్రిన్స్‌తో సహా అనేక షోల్లో నటించారు. 2020 లో స్టార్ట్-అప్‌లో షో తో మంచి ఫేమస్ అయ్యాడు.
Also Read: తరచుగా ఆందోళన, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. గులాబీ పువ్వులతో చెక్ పెట్టండిలా..