Mukku Avinash Marriage: ఓ ఇంటివాడైన ముక్కు అవినాష్.. నెట్టంట వైరల్‌గా మారిన ఫోటోలు
జబర్దస్త్ షోతో కమెడియన్ గా పేరుతెచ్చుకుని.. బిగ్ బాస్ తో పాపులర్ అయిన ముక్కు అవినాష్ రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజను పెద్దల సమక్షంలో వివాహమాడాడు
Updated on: Oct 21, 2021 | 11:40 AM

అవినాష్ వివాహ వేడుకకు జబర్ధస్త్ టీమ్‌తో పాటు, అతడి చిన్ననాటి మిత్రులు, కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు.

కామెడీ యాక్టర్లందరూ కలిసి అవినాష్ వివాహ వేడుకల్లో సందడి చేశారు. పలువురు నటీనటులు అవినాష్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

చాలా ఏళ్ళు జబర్దస్త్ లో కమెడియన్ గా చేశారు అవినాష్. కెవ్వు కార్తీక్ తో పాటు ఆయన టీమ్ లీడర్ కూడా అయ్యారు. గత ఏడాది అవినాష్ కి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం రావడం జరిగింది. తనదైన గేమ్ తో అవినాష్ చివరి ఎపిసోడ్స్ వరకు కొనసాగాడు. ఫైనల్ కి రెండు వారాల ముందు అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు.

ముఖ్యంగా జబర్దస్త్ నటులతో పాటు బిగ్ బాస్ సెలబ్రిటీలు భానుశ్రీ, రోల్ రైడా, దివి పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త పెళ్ళికొడుకు అవినాష్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు.

టాలెంట్ తో ఎదిగిన అవినాష్ కెరీర్ లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగులు వేస్తూ కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారు. తాజాగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాడు.





























