ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు‌పై తీవ్రత 6.9గా నమోదు కాగా.. జకార్తాలోని సుమిత్రా, జావా దీవుల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని స్థానిక జియోలాజికల్ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సునామీ వచ్చే అవకాశం కూడా ఉందని ఇండోనేషియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను భద్రతా అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మరోవైపు భూకంప ప్రభావం వల్ల ప్రాణ నష్టమేమి సంభవించలేదు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం […]

  • Ravi Kiran
  • Publish Date - 10:46 pm, Fri, 2 August 19
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు‌పై తీవ్రత 6.9గా నమోదు కాగా.. జకార్తాలోని సుమిత్రా, జావా దీవుల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని స్థానిక జియోలాజికల్ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సునామీ వచ్చే అవకాశం కూడా ఉందని ఇండోనేషియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను భద్రతా అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మరోవైపు భూకంప ప్రభావం వల్ల ప్రాణ నష్టమేమి సంభవించలేదు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.