AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌పై నోబెల్ గ్రహీత ప్రశంసలు.. ప్రధాని మోదీకి మరియా మచాడో ప్రత్యేక విజ్ఞప్తి!

2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియు భారత ప్రజాస్వామ్యంపై ప్రశంసలు కురిపించారు. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కార్యకర్త మరియా కొరినా మచాడో. భారతదేశాన్ని గొప్ప ప్రజాస్వామ్యం, ప్రపంచానికి ఆదర్శంగా అభివర్ణించారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశం వెనిజులాకు ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారగలదని అన్నారు.

భారత్‌పై నోబెల్ గ్రహీత ప్రశంసలు.. ప్రధాని మోదీకి మరియా మచాడో ప్రత్యేక విజ్ఞప్తి!
Pm Modi, Machado
Balaraju Goud
|

Updated on: Oct 25, 2025 | 5:05 PM

Share

2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియు భారత ప్రజాస్వామ్యంపై ప్రశంసలు కురిపించారు. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కార్యకర్త మరియా కొరినా మచాడో. భారతదేశాన్ని గొప్ప ప్రజాస్వామ్యం, ప్రపంచానికి ఆదర్శంగా అభివర్ణించారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశం వెనిజులాకు ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారగలదని అన్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత రెండు దేశాలు అనేక రంగాలలో కలిసి పనిచేయగలవని మచాడో అశాభావం వ్యక్తం చేశారు.

“భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి త్వరలో స్వేచ్ఛాయుత వెనిజులాకు ఆహ్వానించాలనుకుంటున్నాను” అని మచాడో అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య పాత్రను ఆమె ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా ఉంచడం చాలా ముఖ్యం అని అన్నారు. మహాత్మా గాంధీ అహింసా పోరాటం నుండి ప్రేరణ పొందడం గురించి మచాడో గొప్పగా చెప్పారు. “శాంతి బలహీనత కాదని మహాత్మ గాంధీ మొత్తం ప్రపంచానికి చూపించారు” అని ఆమె అన్నారు.

2024లో వెనిజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షం అఖండ విజయం సాధించిందని, కానీ నికోలస్ మదురో ప్రభుత్వం ఆ ఎన్నికలను రద్దు చేసిందని ఆమె అన్నారు. మదురోకు శాంతియుతంగా అధికారాన్ని వదులుకోవాలని వారు ప్రతిపాదించారని, కానీ మదురో నిరాకరించి దేశంపై కఠినమైన అణిచివేతను ప్రారంభించారని ఆమె అన్నారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కీలక మిత్రులలో ఒకరని మచాడో అన్నారు. అంతర్జాతీయ మద్దతుతో, మదురో తన సమయం ముగిసిందని అర్థం చేసుకుంటారని, అతను శాంతియుతంగా అధికారాన్ని వదులుకోవాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించిన తర్వాత, భారత కంపెనీలు ఇంధనం, మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్లలో పెట్టుబడులు పెట్టవచ్చని మచాడో భారతదేశానికి చెప్పారు.

భారతదేశం-వెనిజులా సంబంధాలు

ప్రజాస్వామ్యం, మానవ హక్కులను సమర్థించే దేశాల జాబితాలో చేరాలని మచాడో భారతదేశాన్ని ఆహ్వానించారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరించిన తర్వాత, భారతీయ కంపెనీలు ఇంధనం, మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్ రంగాలలో పెట్టుబడులు పెట్టవచ్చని ఆమె పేర్కొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య బలం, అనుభవం వెనిజులా ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి మార్గనిర్దేశం చేయగలవని మచాడో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదని, భారతదేశం వంటి పెద్ద ప్రజాస్వామిక దేశంలో బాధ్యత చాలా పెద్దదని, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇటువంటి ఉదాహరణల నుండి నేర్చుకుంటుందని మచాడో చివరకు సందేశం ఇచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..