AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: సింధూర్ ఆపరేషన్‌పై పాక్ పార్లమెంట్‌లో ప్రధాని షరీఫ్ ప్రసంగం.. పాకిస్తాన్‌లో రెడ్ అలర్ట్

ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పార్లమెంటులో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో షాబాజ్ షరీఫ్ భారతదేశంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. "భారతదేశం చీకటిని ఆసరాగా చేసుకుని పిరికితనంతో దాడి చేసింది.. ఈ దాడి సైనిక దాడి మాత్రమే కాదు, మన సార్వభౌమాధికారం.. గౌరవంపై కూడా దాడి అని చెప్పారు. అయితే ఇలా ప్రసంగం చేస్తున్న సమయంలో మధ్యలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. అది అందరి దృష్టిని ఆకర్షించింది.

Pakistan: సింధూర్ ఆపరేషన్‌పై పాక్ పార్లమెంట్‌లో ప్రధాని షరీఫ్ ప్రసంగం.. పాకిస్తాన్‌లో రెడ్ అలర్ట్
Pakistan Prime Minister
Surya Kala
|

Updated on: May 07, 2025 | 9:05 PM

Share

ఉగ్రదాడులకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత వైమానిక దళం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి చేసింది. అర్థరాత్రి ఖచ్చితంగా గుర్తు పట్టిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆర్మీ దాడులు చేసింది. ఇది పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఈ దాడి తర్వాత ఈరోజు ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పార్లమెంటులో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రసంగం మధ్యలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది.

ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ దాదాపు 25 నిమిషాల పాటు పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత.. ఎవరో వెనుక నుండి ఒక కాగితం ముక్కను ఇచ్చారు. దీంతో షాబాజ్ షరీఫ్ ముఖం అకస్మాత్తుగా గంభీరంగా మారిపోయింది, అతను తన ప్రసంగాన్ని అసంపూర్ణంగా వదిలేసి.. మరేమీ మాట్లాడకుండా పార్లమెంటు నుండి త్వరగా వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి అకస్మాత్తుగా లేచి బయటకు వెళ్ళేలా చేసిన ఆ స్లిప్‌లో ఏముందో అంటూ పార్లమెంటులో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.

షాబాజ్ షరీఫ్ అంత్యక్రియలకు హాజరు

ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక అమరవీరుడి అంత్యక్రియలకు తాను, అసిమ్ మునీర్ హాజరు కావాల్సి వచ్చిందని షాబాజ్ షరీఫ్ స్వయంగా పార్లమెంటులో చెప్పారు. అయితే ఆ స్లిప్‌లో ఏం రాసి ఉందో స్పష్టంగా చెప్పలేకపోయారు. ఈ స్లిప్ కారణంగా ఆయన పార్లమెంటును మధ్యలో వదిలి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటులో జరిగిన ఈ దృశ్యం ఎవరూ ఊహించనిది. అంతేకాదు పార్లమెంట్ లో ఉన్న చాలా మంది ఎంపీలు, అధికారులలో భయాందోళనలను సృష్టించింది.

ఇవి కూడా చదవండి

షాబాజ్ తన ప్రసంగంలో ఏమి చెప్పారంటే

తన ప్రసంగంలో షాబాజ్ షరీఫ్ భారతదేశంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. “భారతదేశం చీకటిని ఆసరాగా చేసుకుని పిరికితనంతో దాడి చేసింది. ఈ దాడి సైనిక దాడి మాత్రమే కాదు, మన సార్వభౌమాధికారం, మన గౌరవంపై జరిగిన దాడి అని ఆయన అన్నారు. భారతదేశం వైమానిక దాడి చేసినప్పుడు తాను తుర్కియే పర్యటనలో ఉన్నానని కూడా ఆయన అన్నారు. భారతదేశం తీసుకున్న ఈ చర్య వల్ల పాకిస్తాన్‌లోని పంజాబ్, ఆజాద్ జమ్మూ కాశ్మీర్‌లలో సాధారణ పౌరులు మరణించారని షరీఫ్ పేర్కొన్నారు. “ఈ దాడిలో మహిళలు, పురుషులు, పిల్లలు మరణించారు. తాను దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నా” అని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌లో రెడ్ అలర్ట్

భారత చర్య తర్వాత పాకిస్తాన్ దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాదు పాకిస్తాన్ తన ఎయిర్ స్పేష్ ని రాబోయే 24 నుంచి 36 గంటలు వరకూ మూసివేసింది. ఇస్లామాబాద్ , పంజాబ్‌లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని సూచనలు ఇచ్చారు. సైన్యాన్ని కూడా హై అలర్ట్‌లో ఉంచారు. భారతదేశం చేసిన వైమానిక దాడి పాకిస్తాన్‌లో వ్యూహాత్మక ప్రభావాన్ని కలిగించడమే కాదు రాజకీయ అశాంతిని కూడా పెంచిందని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..