AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer: వేసవిలో చల్లదనం కోసం తెగ బీర్లు తాగేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ఎక్కువగా ఉపయోగించే ఆల్కహాల్ పానీయాలలో బీర్ ఒకటి. కొంతమంది అప్పుడప్పుడు చల్లని బీరును తాగుతారు. ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి ఆరోగ్య ప్రమాదం కలగపోవచ్చు. అయితే కొంతమంది బీరుని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉంటారు. ఇలాంటివారి ఆరోగ్యంపై వివిధ రకాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతిరోజూ బీరు తాగే వ్యక్తి వారిఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..

Beer: వేసవిలో చల్లదనం కోసం తెగ బీర్లు తాగేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..
Beer Side Effects
Surya Kala
|

Updated on: May 07, 2025 | 8:15 PM

Share

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ఎక్కువగా ఉపయోగించే ఆల్కహాల్ పానీయాలలో బీర్ ఒకటి. కొంతమంది అప్పుడప్పుడు చల్లని బీరును తాగుతారు. ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి ఆరోగ్య ప్రమాదం కలగపోవచ్చు. అయితే కొంతమంది బీరుని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉంటారు. ఇలాంటివారి ఆరోగ్యంపై వివిధ రకాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతిరోజూ బీరు తాగే వ్యక్తి వారిఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..

వేసవి కాలంలో తాజాగా.. చల్లగా ఉండటానికి చాలా మంది బీరుని ఎక్కువగా తాగుతారు. ఈ సీజన్‌లో చాలా మంది బీరుని క్రమం తప్పకుండా తీసుకుంటారు. వీరు బీరు వలన ఎటువంటి ప్రమాదం ఉందని భావిస్తారు. కొంతమంది బీరు ఆల్కహాల్ డ్రింక్స్ కంటే తక్కువ హానికరం అని నమ్ముతారు. కనుక బీరుని రెగ్యులర్ గా తాగడానికి ఇష్టపడతారు. వాస్తవానికి పరిమిత పరిమాణంలో బీరు తీసుకోవడం ప్రయోజనకరం అయినప్పటికీ రోజూ క్రమం తప్పకుండా బీరు తాగడం వలన అనేక నష్టాలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం..

క్యాన్సర్ ప్రమాదం ఎవరైనా క్రమం తప్పకుండా బీర్ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో బీర్ తాగడం వల్ల నోరు, కాలేయం, రొమ్ము,గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేలింది. బీర్ ఎక్కువగా తాగడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్, అంటే జీర్ణవ్యవస్థ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

ఇవి కూడా చదవండి

గుండె జబ్బుల ప్రమాదం బీరు తాగడం గుండెకు మంచిదని మీరు చదివి ఉంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా బీరుని ఎక్కువగా తీసుకుంటే అది శారీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. బీరు ఎక్కువగా తాగితే అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. ఇది గుండెకు ప్రమాదకరం.

శరీరంలో పోషకాల లోపం బీరులో పోషకాలు ఉండవు. కనుక దీనిని అధికంగా తీసుకుంటే.. అది మీ శరీరంలో ఉన్న అనేక పోషకాలను తొలగిస్తుంది. బీరుని నిరంతరం తాగడం వల్ల శరీరంలో మెగ్నీషియం, విటమిన్ బి లోపం ఏర్పడుతుందని, ఇది అనేక వ్యాధులకు దారితీస్తుందని ఒక నివేదిక వెల్లడించింది.

మానసిక అనారోగ్యంపై ప్రభావం బీరు ఎక్కువగా తాగడం వల్ల మానసిక అనారోగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది నిరాశ , ఆందోళన వంటి మానసిక ఆరోగ్య రుగ్మతలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం అధికంగా బీర్ తాగడం వల్ల నిరాశ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ