AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల.. అసలు మసూద్‌ అజార్‌ ఎక్కడున్నాడు..?

అన్ని ఉగ్రదాడుల వెనుక ఉన్నది ఆ ఒక్కడే..! అతడే మసూద్‌ అజార్‌. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌. ఆపరేషన్‌ సింధూర్‌లో మెయిన్‌ టార్గెట్‌ ఈ మసూదే. మరి ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత ఏడుపు పెడబొబ్బలతో పాటు భారత్‌పై విర్రవీగిన అతడు ఎక్కడున్నాడు..? మసూద్‌కి రక్షణ కల్పిస్తున్నదెవరు..? అసలు మసూద్‌ ఉన్నాడా..?

ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల.. అసలు మసూద్‌ అజార్‌ ఎక్కడున్నాడు..?
Jaish E Mohammad Chief Maulana Masood Azhar
Balaraju Goud
|

Updated on: May 07, 2025 | 11:36 PM

Share

అన్ని ఉగ్రదాడుల వెనుక ఉన్నది ఆ ఒక్కడే..! అతడే మసూద్‌ అజార్‌. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌. ఆపరేషన్‌ సింధూర్‌లో మెయిన్‌ టార్గెట్‌ ఈ మసూదే. మరి ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత ఏడుపు పెడబొబ్బలతో పాటు భారత్‌పై విర్రవీగిన అతడు ఎక్కడున్నాడు..? మసూద్‌కి రక్షణ కల్పిస్తున్నదెవరు..? అసలు మసూద్‌ ఉన్నాడా..? ఇంతకీ లేఖ విడుదల చేసింది ఎవరు అన్నదీ ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

భారత్‌ ఎటాక్‌తో పాకిస్తాన్‌ గడ్డపై ఉగ్రమూకలు చావుకేకలు పెట్టాయి. పహల్గామ్‌ ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకున్నాడు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌. భారత్‌ రివెంజ్‌ ఎటాక్‌లో మసూద్ అజార్‌ కుటుంబం హతమైంది. మసూద్ సోదరి, మౌలానా కషాఫ్ కుటుంబంతో కలిపి మొత్తం 14మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడిలో తాను చనిపోతే బాగుండని ఘోల్లున ఏడ్చిన మసూర్‌ అజార్‌.. ఆ తర్వాత విర్రవీగాడు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విషం కక్కుతూ ఓ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెల్లగక్కాడు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇకపై జాలి చూపను అంటూ.. మరీ ఓవరాక్షన్‌ చేశాడు మసూద్. తను చేసిన పాపాలన్నీ మరిచిపోయి భారత్‌ తప్పుచేసిందన్నట్లు మాట్లాడుతున్నాడు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ అజార్‌ బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ హెడ్‌క్వార్టర్‌ ఇదే. బహావల్‌‌పూర్ పాకిస్థాన్‌లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్‌ సుభాన్ అల్లా కాంప్లెక్స్‌ నుంచి జైషే మహమ్మద్‌ టెర్రర్‌ ప్లాన్స్‌ వేస్తోంది. దాదాపు 18 ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్‌ క్యాంప్‌ ఉంది. దాన్ని సమాధి చేయడంతో మసూద్‌ అజార్‌ రగిలిపోతున్నాడు.

మసూద్ అజార్‌ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి.. 2000 సంవత్సరంలో జైష్-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్‌ని 1994లో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని అప్పటి భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతడిని మట్టుబెట్టేందుకు భారత్‌ ఆర్మీ దూకుడు మీదుంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితేంటన్నది ఎవరికీ తెలీట్లేదు. మసూర్ అజార్‌ ఇప్పుడెక్కడున్నాడు..? ఎప్పుడూ హై సెక్యూరిటీ కల్పించే పాకిస్థాన్‌ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా..? లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియట్లేదు. అంతేకాదు ప్రతీకారం తప్పదన్న లేఖ అతనిదేనా, లేకపోతే ఉగ్ర గురువు పోవటంతో అతని తోకలెవరన్నా వదిలారా అన్న డౌట్‌ కూడా ఉత్పన్నమవుతోంది. మరోవైపు మసూద్‌ అజహర్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కథ మిగిలే ఉందంటూ ఆయన కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్
ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా...? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే
ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా...? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే
హోలీ రోజే నాలుగు యోగాలు.. వీరి దశ తిరిగినట్లే!
హోలీ రోజే నాలుగు యోగాలు.. వీరి దశ తిరిగినట్లే!
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?