Man Climbs Tree: అరెస్ట్ చేయడానికి వస్తే చుక్కలు చూపించాడు.. మ్యాటరేంటో తెలిస్తే పడి పడి నవ్వుతారు..

Man Climbs Tree: ఎవరైనా నేరం చేస్తే.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తాట తీస్తారు. ఆ భయంతోనే చాలా మంది నేరస్తులు.. తప్పులు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతారు.

Man Climbs Tree: అరెస్ట్ చేయడానికి వస్తే చుక్కలు చూపించాడు.. మ్యాటరేంటో తెలిస్తే పడి పడి నవ్వుతారు..
Arrest
Follow us

|

Updated on: Oct 09, 2021 | 1:15 PM

Man Climbs Tree: ఎవరైనా నేరం చేస్తే.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తాట తీస్తారు. ఆ భయంతోనే చాలా మంది నేరస్తులు.. తప్పులు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతారు. వేషాలు మారుస్తూ.. ప్రాంతాలు మారుస్తూ.. ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే కడుపుబ్బా నవ్వుతారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఒక వ్యక్తి తన స్నేహితురాలిని కొట్టాడని, ఆమె తల్లిని బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు అతనిపై పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు అమ్మాయి వాళ్లు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే, పోలీసులకు భయపడి.. వారి నుంచి తప్పించుకోవడానికి వింత ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. అతని ఇంటికి వెళ్లారు. అయితే, పోలీసుల రాకను గమనించిన ఆ వ్యక్తి భయంతో ఇంటి పైకప్పు ఎక్కాడు. అక్కడి నుంచి మళ్లీ 30 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. చెట్టు ఎక్కి పెద్దగా కేకలు వేశాడు. అయితే, సదరు వ్యక్తిని కిందకు దించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ.. వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 24 గంటల పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. పోలీసులపై నమ్మకం లేని కారణంగానే ఆ వ్యక్తి చెట్టు ఎక్కి నట్లు తెలుస్తోంది. దానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు స్థానికులు. చెట్టు ఎక్కిన వ్యక్తి ఇంటి పక్కనే జైలు శిక్ష అనుభవించిన మరో వ్యక్తి నివాసమున్నాడట. అతను రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించగా.. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారట. ఇదే విషయాన్ని అతను చెట్టు ఎక్కిన వ్యక్తికి గతంలో చెప్పాడట. ఇప్పుడు పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రావడంతో గతంలో తాను విన్న విషయం గుర్తుకొచ్చి భయంతో చెట్టు ఎక్కేశాడట. మొత్తంగా పోలీసులు అతన్ని కిందకు దింపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

Also read:

Andhra Pradesh: అనంతలో వాట్సప్ మెసేజ్ కలకలం.. క్షణాల్లో పోలీసుల రియాక్షన్.. సీన్ కట్ చేస్తే..

Government of India: దేశం ముందు మరో పెద్ద సంక్షోభం.. కీలక విషయాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి..!

చాణక్య నీతి: ఈ మూడు విషయాలు విద్య, సంపద, సైన్యాన్ని నాశనం చేస్తాయి.. అవేంటంటే..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు