Viral News: కూలీ తలపై పడిన అరటిపండ్లు.. 4 కోట్ల పరిహారం చెల్లించుకున్న యజమాని..!

Viral News: మనం నిత్యం ఎన్నో రకాల వార్తలు చూస్తుంటాం. చాలా వరకు మనకు పనికి వచ్చే, ఉపయోగపడే వార్తలే ఉంటాయి. అదే సమయంలో కొన్ని సరదా వార్తలు కూడా ఉంటాయి.

Viral News: కూలీ తలపై పడిన అరటిపండ్లు.. 4 కోట్ల పరిహారం చెల్లించుకున్న యజమాని..!
Banana
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2021 | 1:53 PM

Viral News: మనం నిత్యం ఎన్నో రకాల వార్తలు చూస్తుంటాం. చాలా వరకు మనకు పనికి వచ్చే, ఉపయోగపడే వార్తలే ఉంటాయి. అదే సమయంలో కొన్ని సరదా వార్తలు కూడా ఉంటాయి. ఆ వార్తలను చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి ఫన్నీ వార్తనే మీ ముందుకు తీసుకువస్తున్నాయి. ఇది వింటే మీరు నిజంగా షాకై నోరెళ్లబడతారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో అరటి పొలంలో పనిచేసే వ్యక్తి తలపై అరటిపండ్ల ట్రే పడి గాయపడగా.. అతను తోట యజమానిపై 5 లక్షల డాలర్ల పరిహారం కోరుతూ కోర్టులో దావా వేశాడు. చివరికి కూలీ వాదనలే నిలవడంతో.. కోర్టు అరటితోట యజమానికి సుమారు నాలుగు కోట్ల జరిమానా విధించింది. ఈ వార్త విని జనాలు షాక్ అవుతున్నారు.

ఇంతకీ దీనికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2016 సంవత్సరంలో క్వీన్‌ల్యాండ్‌లోని కుక్‌టౌన్ సమీపంలో ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో లాంగ్‌బాటమ్ అనే వ్యక్తి పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు అరిటి పండ్ల ట్రే అతనిపై పడింది. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు అతను వికలాంగుడిలా మారాల్సి వచ్చింది. ఫలితంగా అప్పటి నుంచి అతను పనిచేయలేక ఉపాధి కోల్పోయాడు. దాంతో బాధిత వ్యక్తి 502,740 డాలర్ల పరిహారం కోరుతూ కోర్టులో దావా వేశాడు.

అయితే, ఈ కేసుపై తాజాగా కోర్టులో వాదనలు జరిగాయి. అరటి పండ్ల ట్రే మీద పడటం కారణంగా వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడ్ని, అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. ఈ కారణంగానే.. కార్మికుడికి 502,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 3,77,15,630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో యాజమాన్యం చాలా అజాగ్రత్తగా వ్యవహరించిందంటూ న్యాయస్థానం మందలించింది. కాగా, ఈ వార్త విని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అయితే, ఇంత భారీ జరిమానా విధించడం ఇదే తొలిసారి అని టాక్ నడుస్తోంది.

Also read:

Beauty Tips For Skin: మోకాళ్లు, మేచేతుల వద్ద చర్మం నల్లగా ఉందా?.. అయితే ఇలా తొలగించుకోండి..

Man Climbs Tree: అరెస్ట్ చేయడానికి వస్తే చుక్కలు చూపించాడు.. మ్యాటరేంటో తెలిస్తే పడి పడి నవ్వుతారు..

Andhra Pradesh: అనంతలో వాట్సప్ మెసేజ్ కలకలం.. క్షణాల్లో పోలీసుల రియాక్షన్.. సీన్ కట్ చేస్తే..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..