AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌పై భారత్‌ దాడి చేస్తే.. చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోండి! మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ సైనిక అధికారి ఫజ్లుర్ రెహమాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌పై భారతదేశం దాడి చేస్తే, బంగ్లాదేశ్, చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని ఆయన సూచించారు.

పాక్‌పై భారత్‌ దాడి చేస్తే..  చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోండి! మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
Alm Fazlur Rahman And Yunus
SN Pasha
|

Updated on: May 03, 2025 | 1:28 PM

Share

26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇద సందు అన్నట్లు.. బంగ్లాదేశ్ మాజీ సైనిక అధికారి ఫజ్లుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై భారత్‌కి వెళ్తే.. బంగ్లాదేశ్‌, చైనాతో కలిసి ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సూచించారు. అయితే రెహమాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పందిస్తూ, “ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరిని లేదా విధానాలను ప్రతిబింబించవు. అందువల్ల, ప్రభుత్వం అటువంటి వ్యాఖ్యలను ఏ రూపంలోనూ లేదా పద్ధతిలోనూ ఆమోదించదు లేదా మద్దతు ఇవ్వదు” అని పేర్కొంది. రెహమాన్ వ్యక్తిగత అభిప్రాయాలతో దేశానికి ముడిపెట్టవద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, పరస్పర గౌరవం, అన్ని దేశాల శాంతియుత సహజీవనం సూత్రాలకు దృఢంగా కట్టుబడి ఉందని బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

“భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించాలి” అని రెహమాన్ మంగళవారం ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. “ఈ విషయంలో ఉమ్మడి సైనిక ఏర్పాటుపై చైనాతో చర్చలు ప్రారంభించడం అవసరమని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటులో జరిగిన హత్యలను పరిశోధించడానికి నియమించబడిన జాతీయ స్వతంత్ర కమిషన్ ఛైర్మన్‌గా డిసెంబర్ 2024లో నియమితులైనందున, రెహమానా యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. బంగ్లాదేశ్ అగ్ర నాయకత్వం కూడా ఇటీవలి కాలంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి