Vladimir Putin: మీరెప్పుడైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిని చూశారా?
ప్రతి ఒక్కరు ఇళ్లు కట్టుకునే ముందు వాస్తుతో సహా అన్ని చూసుకుంటారు. తాము ఉండబోయే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండాలనుకుంటారు. ఇక బాగా డబ్బున్న వారు.. ఇళ్లను అందంగా డిజైన్ చేయించుకుంటారు. రాష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తన ఇంటిని బంగారు ఫ్రేమ్డ్ అద్దాల, పురాతన వస్తువులతో ఎంతో అందంగా డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఓ రష్యన్ జర్నలిస్ట్ పుతిన్ ఇంటర్వ్యూ తీసుకుంటూ అతని ఇంటిని చూపించడంతో..ప్రస్తుతం అందరి దృష్టి వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై పడింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి డిజైన్ చేసుకున్న తన నివాసాన్ని ఓ రష్యన్ జర్నలిస్ట్ ప్రజలకు చూపించారు. విశాలవంతమైన ప్రదేశంలో నిర్మించిన పుతిన్ నివాసం ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక ఆ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో మనం పుతిన్ ఇంటిని చూడవచ్చు. పుతిన్ ఆ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ అతనికి తన ఇంటిని చూపించారు. పుతిన్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ పెద్ద బంగారు ఫ్రేమ్డ్ అద్దాలను మనం గమనించవచ్చు. కింద వీడియోలోని అపార్ట్‌మెంట్ దృశ్యాలను మనం నిశితంగా గమనిస్తే.. ఆ ఇంటి ఆవరణలో ఉన్న పూల మొక్కలు, ఇంటి చక్కదనం అద్భుతమైన అందాన్ని నిర్వచిస్తుంది.
❓❓ Have you been to PUTIN's home? Just look at how he lives. Lavish interiors, grand curtains, a piano, golden moldings… and a portrait of Emperor Alexander III on the wall.And don't be fooled (this isn’t his only home). There are palaces, summer estates, secret residences,… pic.twitter.com/2lOGqrbrm4
— Andrii Naumov (@Naumov_Andrii) May 2, 2025
పుతిన్ ఇంట్లో ఏముంది..
ఇక పుతిన్ ఇంట్లో అందరి దృష్టిని ఆకర్షించే మొదటి విషయం ఏమిటంటే, రష్యన్ చక్రవర్తి అలెగ్జాండర్ IIIకి చెందిన చిత్రపటం. ఇది ఇంట్లోకి ప్రవేశించగానే మనకు కనిపిస్తోంది. ఈ అలెగ్జాండర్ చిత్రపటం ప్రత్యేకంగా ఒక టేబుల్‌పై ఉంచబడి ఉంటుంది. తర్వాత కిటికీ పక్కన ఓ తెల్లటి గ్రాండ్ పియానో కూడా మనకు కనిపిస్తోంది. అయితే దానిని వాయించడానికి మీకు సమయం దొరుకుతుందా అని ఆ జర్నలిస్ట్ పుతిన్‌ను అడిగినప్పుడు.. ఆయన స్పందిస్తూ, తనకు చాలా అరుదుగా సమయం దొరుకుతుందని.. అలాంటి సమయాల్లో దాని వాయిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పుతిన్ ఇంట్లో ఓ ప్రత్యేక చెక్క టచ్‌తో కూడిన లైబ్రరీ, రెండు విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, చిన్న ‘హోమ్ చర్చి’ కూడా ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
