Tesla Car: టెస్లా కార్లు కొంటున్నారా..? జాగ్రత్త బ్రదర్స్

EVM సంగతి సరే .. EV మాటేంటి?... అప్పట్లో భారత్ EVMలపై నోరు పారేసుకున్న ఎలాన్‌ మస్క్‌కు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ షాక్‌ తగిలిందా? మస్క్‌ కారుకు ఫెయిల్యూర్‌ మార్క్‌ పడిందా? టెక్నాలజీలో లూప్‌ హోల్స్‌..పరిపాటిగా మారిన యాక్సిడెంట్‌ కేసులు ..రోడ్‌ సేఫ్టీ అథార్టీ అక్షింతలు.. వెరసి టెస్లా ఏంటీ ఇలా? అనే చర్చ జోరందుకుంది. టెస్లా EV కారుపై ఎన్నెన్నో కథనాలు.. మరి గ్రౌండ్‌ రియాల్టీ ఏంటో తెలుసుకుందాం

Tesla Car: టెస్లా కార్లు కొంటున్నారా..? జాగ్రత్త బ్రదర్స్
Tesla Car Blast
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2024 | 9:16 PM

 ఎక్స్‌.. స్పేస్‌ ఎక్స్‌  మాత్రమే కాదు  టెస్లా కూడా  ఈ టైకూన్‌దే.. ఎలాన్‌ మస్క్‌ పట్టిందల్లా బంగారమే . ఈ అపరకుబేరుడు  టెస్లా సహా వ్యవస్థాపకుడు. స్నేస్‌ ఎక్స్‌తో  ఆకాశాన్ని, టెస్లాతో ఆన్‌ రోడ్‌ను తన  క్యాప్చర్‌ చేసేశాడు. అమెరికా సహా వాల్డ్‌ వైడ్‌గా  టెస్లా బ్రాండ్‌దే హవా. ఇక అమెరికాలో ఎన్నారైలకు టెస్లానే ..హాట్‌ ఫేవరేట్‌ టెస్లా అంటే … కారనుకుంటివా !! ఫైరు!!. ఈ మధ్య ఈ కార్లు అంతలా బ్లాస్ట్ అవుతున్నాయి..

ఫుల్‌ సెల్ఫ్‌  డ్రైవింగ్‌ టెస్లా కార్లపై  వివాదాలు అన్నీ ఇన్నీ కావు.  ఐనా సరే  అమెరికాలోని భారతీయులకు టెస్లా అంటే పిచ్చి. ఏదైనా సినిమా ఫంక్షన్లంటే చాలు.. టెస్లా కార్లే క్యూ కడతాయి!. కానీ  హై ఎండ్‌ టెక్నాలజీ టెస్లా బ్రాండ్‌ కార్లకు   ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌ వుంది. ఇక మాన్యుఫ్యాక్చరింగ్‌  గురించి చెప్పతరమా. టెస్లా బండి తయారీ అట్లుంటది. దునియాలో ఇట్టాంటి  బండి లేదని ఉండబోదని దండిగా ప్రచారం చేశాడు ఎలాన్‌ మస్క్‌. ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను  విసృతం చేస్తున్నారు  కూడా. ఇక భవిష్యత్‌ అంతా  టెస్లా రోబో ట్యాక్సీదేనని  డ్యాన్స్‌ వేస్తూ ఢంకా బజాయించాడు కూడా.

డ్రైవర్‌ అవసరం లేకుండా..అసలు  స్టీరింగ్‌..  పెడల్స్‌ ఉసే లేకుండా  2026 కల్లా కంప్లీట్‌ ఏఐ ఆపరేటెడ్‌ బండ్లను రోడ్డెక్కిస్తానని  ప్రకటించాడు ఎలాన్‌ మస్క్‌. కానీ ఆ  ముచ్చట సంగతేమో కానీ ఇప్పుడు టెస్లా బిల్డింగ్‌  మంచు ముద్దయినట్టు ఇప్పుడు టెస్లాకార్ల  తీరు  వివాదాలతో తడిసి ముద్దవుతోంది. టెస్లా కార్ల మూలంగా ఆన్‌ రోడ్‌లో ఇదిగో ఇలా యాక్సిడెంట్లు షరా మాములయ్యాయి.  జంక్షన్‌ల దగ్గర  రెడ్‌ అండ్‌ గ్రీన్‌ లైట్లను ఫాలో అవడం మినహా..  సడెన్‌గా  ఏ వాహనమైనా ఎవరైనా అడ్డొస్తే  గుర్తించే ప్రొగ్రామింగ్‌ లేదనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండిలో కెమెరాలు ఫిక్స్‌ చేశారనే కానీ సెన్సార్‌ రాడర్స్‌ లేవనేది ఆరోపణ.

టెస్లా ఎలక్ట్రికల్‌  కార్‌ ..చూడ్డానికి కత్తిలాంటి కారే.  ఇక చార్జింగ్‌ స్టేషన్‌లకు కొదవ లేదు.  ఐతే  హై ఎండ్‌ టెక్నాలజీ  అని గొప్పగా చెప్పుకోవడమే కానీ  ఇందులోనూ  ఎన్నో లూప్‌  హోల్స్‌ ఉన్నాయి. చార్జింగ్‌ టైమ్‌లో  బండి బ్లాస్టవుతోన్న  ఘటనలు హడలెత్తిస్తున్నాయి.  గ్యారెజీలో టెస్లా చార్జింగ్‌ చేస్తుండగా అదే జరిగింది. కారుతో  పాటు ఇల్లు బుగ్గిపాలైంది. ఔను కదా.. టెస్లా అంటే కారునుకుంటిరా..ఫైర్‌ అన్నట్టుగా మారింది పరిస్థితి. హై ఎండ్‌ టెక్నాలజీ..ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ అని ఉదరగొడుతూ  ఎలాన్‌ మస్కా కస్టమర్ల  చెవిలో కాలిఫ్లవర్‌లు పెట్టేశాడా? అనే చర్చతో పాటు…మరో రచ్చ కూడా జోరందుకుంది.  రీసెంట్‌ టైమ్‌లో ఇండియన్‌ ఈవీఎంలపై ఎలన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు చేశాడు.ఈవీఎం ఫలితాలను మార్చవచ్చన్నాడు. ఆ వ్యాఖ్యలను కోట్‌ చేస్తూ…  టెస్లా  టెక్నో ఫెయిల్యూర్స్‌ను ఎండగడుతున్నారెందరో.  ఈవీఎంల గురించి  మాట్టడం కాదు.. ముందు  EV  టెస్లా లూప్‌ హోల్స్‌ను సరిదిద్దుకో  బుజ్జా అని ట్వీట్లతో ఏకిపారేస్తున్నారు.  ఇక సోపెస్టికేటెడ్‌  టెస్లా ఎందుకింత కాంట్రావర్సీగా మారింది? కారణాలు , కథనాలు ఇంకా చాలా వున్నాయి మరి.

టెస్లా…వారెవా వాటే కార్‌? అని అబ్బురపడే హై ఎండ్‌ ఫీచర్స్‌ వున్న బండి. దౌడ్‌ తీయడంలో రేసు గుర్రం. సేల్స్‌లోనూ అదే జోరు. ఎలక్ట్రిక్‌ కార్‌ సెక్టార్‌లో మ్యాగ్జిమమ్‌ షేర్‌ టెస్లాదే. ఇదంతా బాగానే ఉంది కానీ.. వివాదాలు కూడా అదే స్థాయిలో వున్నాయి. మ్యాన్యువల్‌.. ఆటో స్టీరింగ్‌ రెండు రకాలుగా డ్రైవ్‌ చేసే ఫీచర్స్‌ వున్నాయి. ఐతే ఆటో మోడ్‌లో జరుగుతోన్న ప్రమాదాలు టెస్లా బ్రాండ్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్నాయి.

ఇవేం రోడ్లు రా బాబూ అనడం మన దగ్గర మాములు ముచ్చట. అంతేనా పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు చూసినా చూడకున్నా అమెరికా రోడ్లను తెగపొగిడేస్తుంటాం. అట్లాంటి రోడ్ల మీద కత్తి లాంటి టెస్లా బండితో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన దగ్గరైతే బండి కాస్త డ్యామేజయితే వెంటనే బీమా వుంది కదా అనే దీమా వుంటుంది. మరి టెస్లా డ్యామేజ్‌కి ఆ ధీమా ఉందా! లేదా!!

చూడ్డానికి టెస్లా ఎలక్ట్రికల్‌ కారు సూపర్‌ సే ఊపరే. టెస్లా అంటే క్రేజీ ఎంతుందో సేల్స్‌ను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. కొంటే కస్టమర్లకు కిక్కు. టెస్లా ఫ్రాంచైజీలకు లక్కు. బ్రాండ్‌ నేమ్‌ సరే ..టెస్లా బండితో భద్రత ఎంత?

బండి సూస్తిమా కడక్‌.. అడ్వాన్స్డ్‌ ఫీచర్స్‌ అదుర్స్‌. పైగా ఎలాన్‌ మస్క్‌ బ్రాండ్‌..చార్జింగ్‌కు ఫికర్‌ లేదు. పెట్రోల్‌ బంకుల మాదిరే టెస్లా చార్జింగ్‌ సెంటర్స్‌ అందుబాటులో ఉన్నాయి. చార్జింగ్‌ పాయింట్స్‌ దగ్గరకు వెళ్లడం కంపల్సరేమీ కాదు. గ్యారేజీలోనూ చార్జింగ్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఫేట్‌ ఫిరాయిస్తే కారుతో పాటు ఇల్లు కూడా బ్లాస్ట్‌ కావచ్చనే ఘటనలూ వున్నాయి.

కొంటే టెస్లా కారే కొనాలి అనుకోవడంలో తప్పు లేదు. టెక్నాలజీ విషయంలో అప్‌డేట్‌ కావాలనుకోవడంలోనూ తప్పు లేదు. కానీ ఫీచర్స్‌పై సరైన అవగాహన లేకపోతే మాత్రం ముప్పు తప్పదు. ముఖ్యంగా టెస్లా ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు. చార్జింగ్‌ చేసేప్పుడే కాదు ఆన్‌రోడ్‌పైన కూడా రిస్క్‌ మామూలుగా వుండదు. సడెన్‌గా బ్యాటరీ డిశ్చార్జ్‌ అయితే ….!!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..