Rishi Sunak: క్షేత్రస్థాయి పర్యటనకు బ్రిటన్ ప్రధాని.. ఓ మహిళ నుంచి ఎదురైన ప్రశ్నకు షాకైన రిషి సునాక్..
బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సమస్యలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు రిషి సునాక్. దీనిలో భాగంగా రోగులను పరామర్శించేందుకు సౌత్ లండన్‌లోని క్రొయిడన్..
ఆర్థికంగా ఎంతో బలమైన దేశంగా ఉన్న బ్రిటన్ కూడా ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతోంది. తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ కు ఇదొక సవాల్ అనే చెప్పుకోవాలి. దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి నిర్థిష్ట ప్రణాళిక లేకపోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే లిజ్ ట్రస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లిజ్ ట్రస్ రాజీనామాతో రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సమస్యలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు రిషి సునాక్. దీనిలో భాగంగా రోగులను పరామర్శించేందుకు సౌత్ లండన్‌లోని క్రొయిడన్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి చికిత్స పొందుతున్న ఓ వృద్ద మహిళా పేషంట్‌ను పరామర్శించారు రిషి సునాక్.. ఇక్కడ వైద్యం ఎలా ఉంది, హాస్పటల్ సిబ్బంది బాగా చూసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రిషి సునాక్ ప్రశ్నకు ఆ వృద్ధురాలు ఇచ్చిన సమాధానం బ్రిటన్ ప్రధానిని షాక్ కు గురిచేసింది. అంతే కాదు ఓ విధంగా ఆ ప్రశ్నతో ఆయన ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవచ్చు.
ఆస్పత్రి సిబ్బంది నన్ను బాగానే చూసుకుంటున్నారని, కానీ మీరు వారికి ఇచ్చే జీతాలను చూస్తుంటే బాధగా ఉంది అని సమాధానం ఇచ్చింది వృద్దురాలు. నర్సుల జీతాలు పెంచడంతో పాటు నేషనల్ హెల్త్ స్కీమ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించింది.. తాము ఈ దిశగా చర్యలలకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని రిషి సునాక్ ఆమెకు చెప్పారు. అయితే మీ ప్రయత్నం మామూలుగా కాదు, కాస్త గట్టిగా ఉండాలని స్పష్టం చేసింది మహిళ. ఆశ్చర్యానకి గురైన రిషి సునాక్ మీ సూచన కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.. అక్కడి సిబ్బంది సేవలను ప్రశంసించారు.
బ్రిటన్‌లో 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది ఉండగా, చాలా మందికి ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ జీతాలు పెరగలేదు.. కరోనా సంక్షోభం తర్వాత వీరి మీద పని ఒత్తిడి పెరిగినా, వేతనాలను పెంచలేదు.. చాలీ చాలని జీతాలతో సేవలందిస్తున్న వీరంతా ఇటీవల దవ్యోల్భణం కారణంగా చాలా అవస్థలు పడుతున్నారు.. జీతాలను పెంచాలని కోరుతూ సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో నర్సుల జీతాలు పెంచాలని ప్రధానమంత్రిని ఓ మహిళ అడగడంతో రిషి సునాక్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రిషి సునాక్ తో సెల్ఫీలు దిగారు. మీ కోసం ఎదురుచూస్తున్నామని మరికొంతమంది రిషి సునాక్ తో అన్నారు.
A patient at Croydon University Hospital tells Rishi Sunak…
“It’s a pity you don’t pay them (NHS Staff) more… you need to try harder”
We agree, do you? pic.twitter.com/OtvBl8Iqqy
— Keep Our NHS Public (@keepnhspublic) October 28, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..