యూసఫ్ సర్కార్‌కి పోయేకాలం..! బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు టార్గెట్ అయింది?

బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై హిందూ సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో హిందువులు నిరంతరం నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ పట్ల తాము ఆందోళన చెందుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇస్కాన్ సంస్థ మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉంది. అయినా మన పొరుగు దేశంలోనే ఇస్కాన్ లక్ష్యంగా ఎందుకు మారింది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.

యూసఫ్ సర్కార్‌కి పోయేకాలం..! బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు టార్గెట్ అయింది?
Iskcon Bangladesh
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2024 | 1:07 PM

ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్‌నెస్ అసోసియేషన్ అంటే ఇస్కాన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇష్కాన్ కు చెందిన ముఖ్యమైన నేత చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి అరెస్ట్ కావడమే కారణం. చిన్మోయ్ కృష్ణ దాస్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఆయన ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్తుండగా అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ పోలీసుల చర్యపై హిందువుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ చర్యను వారు వ్యతిరేకిస్తున్నారు. వందలాది మంది ప్రజలు రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు.

చిన్మయ్ దాస్ అరెస్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ పట్ల తాము ఆందోళన చెందుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌లో చిన్మయ్ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మైనారిటీలపై దాడులు జరగడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

చిన్మయ్ దాస్ పై వచ్చిన ఆరోపణలేంటి?

చిన్మోయ్ కృష్ణ దాస్ బంగ్లాదేశ్‌లోని హిందువుల హక్కుల పరిరక్షణ కోసం గొంతు వినిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, మైనారిటీ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. చిన్మయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 30న కేసు నమోదైంది. చిట్టగాంగ్‌లోని న్యూ మార్కెట్ ప్రాంతంలో హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

చిన్మోయ్ దాస్ బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌తో పాటు హిందువులకు ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఆ దేశంలో ఇస్కాన్‌ సంస్థ గురించి చాలా ప్రచారం చేశాడు. బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా తగ్గుతున్న సమయంలో హిందువుల గురించి హిందూ ధర్మం గురించి బంగ్లాదేశ్ హిందువులలో అవగాహన కల్పించడానికి ఇస్కాన్ చేస్తున్న ప్రయత్నాలు మహమ్మద్ యూనస్‌కు నచ్చడం లేదు. దీంతో ఇస్కాన్ ఈ ప్రభుత్వ లక్ష్యంగా మారింది. అసలు ఇస్కాన్ పై నిషేధం విధించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

ఇస్కాన్ అంటే ఏమిటంటే

ఇస్కాన్ అనేది శ్రీకృష్ణుడి గురించి ప్రజలకు అవగాహన కల్పించే సంస్థ. భగవత్ గీత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. స్వామి శ్రీల ప్రభుపాద ఈ ఇస్కాన్ సంస్థను జూలై 11, 1966న స్థాపించారు. ఈ ఇస్కాన్ ను ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది హరే కృష్ణ హరే రామ ఆలయంగా సాధారణ ప్రజలలో గుర్తించబడింది.

ఇస్కాన్ ఆలయాలు భారతదేశంలోనే కాదు అమెరికా, రష్యా, బ్రిటన్, పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. మొత్తంమీద ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలు ఉన్నాయి. దీనికి అనేక కేంద్రాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ ఆలయాల గురించి చెప్పాలంటే ఢాకా, రాజ్‌షాహి, చిట్టగాంగ్, సిల్హెట్, రంగ్‌పూర్, ఖుల్నా, బరిషల్, మైమెన్‌సింగ్‌లలో ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను ఎందుకు లక్ష్యంగా మారిందంటే

ఇస్కాన్ దేవాలయాలు బంగ్లాదేశ్‌లోనే కాకుండా పాకిస్థాన్‌లో కూడా ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌లో ఉన్న ఇస్కాన్ కంటే.. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ లక్షంగా మారింది. దీనికి కారణం ఏమిటంటే.. భారత దేశం నుంచి తర్వాత పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడినప్పుడు.. బంగ్లాదేశ్ జనాభాలో దాదాపు 20% హిందువులు ఉండేవారు. అయితే ఆ దేశంలో హిందువుల సంఖ్య 9% కంటే తక్కువగా ఉంది. దశాబ్దాలుగా హిందువులకు షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతని ఇస్తున్నా.. క్రమంగా ఆ దేశంలో హిందువుల సంఖ్య తగ్గుతూనే ఉంది. అయితే ఇస్కాన్ సంస్థ హిందువులకు హిందు ధర్మం గురించి భోదిస్తూ వారిలో సనాతన ధర్మం గురించి అవగాహన కలిపించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ దేశంలో అధికారం మారడంతో.. హిందువులకు చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి.

బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు ఎల్లప్పుడూ దుర్మార్గులకు, అల్లర్లు చేసే వారికి లక్ష్యంగా మారతాయని.. అక్కడ మైనారిటీ సంఘం నాయకులు పేర్కొన్నారు. BBC నివేదిక ప్రకారం జనవరి 2013 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య హిందూ సమాజంపై కనీసం 3,679 సార్లు దాడులు జరిగాయి.

హసీనా అధికారం నుంచి తప్పుకున్న తర్వాత ఆ దేశంలోని హిందువులు తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా ప్రకటించాలనే డిమాండ్‌ కూడా లేవనెత్తింది. 90% ముస్లిం జనాభా ఉన్న దేశంలో సోషలిజం, లౌకికవాదం వాస్తవికతను ప్రతిబింబించవని ఆ దేశ అటార్నీ జనరల్ MD అసదుజ్జమాన్ అన్నారు.

బంగ్లాదేశ్‌లోని హిందువులపై ఇస్కాన్, చిన్మయ్ దాస్ చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. అంతేకాదు బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితంగా లేరంటూ ఇస్కాన్ కథనాన్ని సృష్టిస్తోందని కూడా ఆరోపిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అధ్వర్యంలో ఇస్కాన్‌కు ఆదరణ నిరంతరం పెరుగుతూ ఉంది. ఇక్కడ చిన్మోయ్ కృష్ణ దాస్ కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇస్కాన్ అనేక హిందూ పండుగలలో చురుకుగా పాల్గొంటుంది. ముఖ్యంగా జన్మాష్టమి వేడుకల సమయంలో మత బేధం లేకుండా ఆ దేశంలోని పేదలకు రేషన్ కూడా అందజేస్తోంది. ఇస్కాన్ అధర్యంలో చిన్మోయ్ కృష్ణ దాస్ చేస్తోన్న ఈ పనులు, ఈ ప్రచారం.. ఇస్కాన్ ఆదరణ యూనస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇస్కాన్ మీద కోపంతో దానిపై చర్య తీసుకుంటోంది. అందులో భాగంగా చిన్మోయ్ కృష్ణ దాస్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..