Khalistan issue: పన్నూపై నిషేధం విధించాలని అభ్యర్థన చేసిన కెనడా హిందూ గ్రూపులు
భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా చల్లారలేదు. మరోవైపు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుపై కూడా కెనడాలో నిరసన పెరుగుతోంది. అతడు హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం చర్చనీయాంశమైంది. ది హిందూ ఫోరం కెనడా (హెచ్‌ఎఫ్‌సీ).. అతడు చైసిన ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడు కెనడాలో అడుగుపెట్టకుపెట్టకుండా నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా చల్లారలేదు. మరోవైపు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుపై కూడా కెనడాలో నిరసన పెరుగుతోంది. అతడు హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం చర్చనీయాంశమైంది. ది హిందూ ఫోరం కెనడా (హెచ్‌ఎఫ్‌సీ).. అతడు చైసిన ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడు కెనడాలో అడుగుపెట్టకుపెట్టకుండా నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అంతేకాదు గురుపత్వంత్ సింగ్ భారతీయుల్లో భయాన్ని పెంచుతున్నాడని ఆరోపణలు చేసింది. హెచ్‌ఎఫ్‌సీకి చెందిన లీగల్ కౌన్సిల్ పీటర్ థ్రోనింగ్ మంగళవారం కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో ది హిందూ ఫోరం కెనడా ఆందోళనను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్మిగ్రేషన్ శాఖ ఈ విషయంపై విచారన చేయాలని.. అలాగే గురుపత్వంత్ సింగ్ పన్నూపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా.. గురుపత్వంత్‌సింగ్ పన్నూ ప్రస్తుతం అమెరికాకు చెందినటువంటి సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థకు ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే అతడు సిక్కులకు ప్రత్యేకంగా దేశం కావాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే అతడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కూడా ఓ ప్రకటనను విడుదల చేశాడు. పన్నూ, అతడి గ్రూపును భారత ప్రభుత్వం ఇప్పటికే ఉగ్రవాదులుగా ప్రకటించింది. అంతేకాదు అతడు హింసాత్మక వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు చేసింది. అలాగే పన్నూ ఇటీవల ప్రకటన చేసిన సమయంలో కెనడాలోనే ఉన్నాడా? లేడా ? అనే విషయంపై కూడా దర్యాప్తు చేయాలని హెచ్‌ఎఫ్‌సీ తరపు పీటర్ కోరారు. ఒకవేళ అలా ప్రకటన చేసిన సమయంలో ఇక్కడ ఉన్నట్లు తేలితే.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని.. లేకపోయినట్లైతే అతడ్ని కెనడాలోకి రాకుండా నిషేధం విధించాలని పీటక్ అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా.. సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూపై ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పంజాబ్‌లోని ఆ వేర్పాటువాద నేత ఆస్తులను కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం నాడు జప్తు చేసింది. అలాగే ఖలిస్థాన్ మద్దతుదారుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశంపై కెనడాతో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు రగులుతున్నవేళ.. సోషల్ మీడియాలో హిందువులపై గురుపత్వంత్ సింగ్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. హిందువులు కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు చేశాడు. అంతేకాదు.. మరో వీడియోలో కెనడాలో ఉన్నటువంటి భారత దౌత్య సిబ్బందిని కూడా బెదిరించాడు పన్నూ. భారత్, కెనడాల మధ్య కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర దుమారం రేపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




