AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కా ఆధారాలతో బయటపడ్డ పాక్‌ బండారం..! ఉగ్రవాదిని మానవతా వాది అంటూ దొంగనాటకాలు!

లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్‌ను మత నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ పాకిస్థాన్ అడ్డంగా బుక్ అయింది. అతని నిజస్వరూపం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా బహిర్గతమైంది. రవూఫ్ ఉగ్రవాద సంస్థలకు నిధులు సేకరిస్తున్నట్లు తేలింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తోందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

పక్కా ఆధారాలతో బయటపడ్డ పాక్‌ బండారం..! ఉగ్రవాదిని మానవతా వాది అంటూ దొంగనాటకాలు!
Pakistan Army And Local Peo
SN Pasha
|

Updated on: May 12, 2025 | 12:34 PM

Share

పాకిస్తాన్ తన దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని దాచడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కానీ, ఎంత దాచాలని ప్రయత్నిస్తున్నా.. ప్రపంచానికి దాని నిజ స్వరూపం తెలుస్తూనే ఉంది. పాకిస్థాన్‌ ప్రభుత్వం, పాకిస్థాన్‌ సైన్యం అమాయక మతాధికారిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన నాయకుడు, సహాయక చర్యల ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. అతని పేరు హఫీజ్ అబ్దుల్ రవూఫ్. గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతున్న ఓ ఫొటోలో ఉన్న వ్యక్తి ఉగ్రవాది కాదని, మత నాయకుడు అని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ వ్యక్తి కొంతమంది పాకిస్తాన్ సైనికులతో పాటు అంత్యక్రియల ఊరేగింపులో కనిపించాడు. ఆ వ్యక్తి తన ఐడి కార్డు కూడా చూపించి తాను ఒక సాధారణ రాజకీయ కార్యకర్తనని చెప్పాడు.

అయితే పాకిస్తాన్ సైన్యం ఇచ్చిన ఆ వ్యక్తి సమాచారం.. అంటే పేరు, పుట్టిన తేదీ, జాతీయ గుర్తింపు సంఖ్య కూడా అమెరికాచే ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించబడిన వ్యక్తితో పూర్తిగా సరిపోలుతున్నట్లు తేలింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. హఫీజ్ అబ్దుల్ రవూఫ్ లష్కరే తోయిబా (LeT), దాని ఫ్రంట్ సంస్థల కోసం విరాళాలు సేకరిస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చూపించిన ఐడి కార్డులో అతను “వెల్ఫేర్ వింగ్ ఇన్‌చార్జ్, పీఎంఎంఎల్” అని ఉంది, అంటే అతను తన కార్యకలాపాలను దాచడానికి ఒక రాజకీయ లేదా మతపరమైన సంస్థ పేరును ఉపయోగిస్తున్నాడు. పాకిస్తాన్ సైన్యం మత ప్రచారకుడిగా అభివర్ణించిన వ్యక్తి నిజానికి ఒక అంతర్జాతీయ ఉగ్రవాది. దీన్ని బట్టి పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తోందని, ప్రపంచాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది.

1999 నుండి లష్కర్ కోసం పనిచేస్తున్నాను..

యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఫేస్‌ ఆఫ్‌ ది లష్కరే తోయిబాగా ఉన్నాడు. లష్కరే తోయిబా అగ్ర నాయకత్వ బృందంలో చేరిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ 1999 నుండి ఆ సంస్థ కోసం పనిచేస్తున్నాడు. రవూఫ్ లష్కరే ఫ్రంట్ సంస్థ ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ (FIF) అధిపతి, ఇది సహాయ చర్యల ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తుంది. 2008 ముంబై దాడుల తర్వాత లష్కరేపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగినప్పుడు, రవూఫ్ FIF పేరుతో పాకిస్తాన్‌లో నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. 2009లో ఈ కార్యక్రమం నుండి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు సమాచారం. లష్కరే తోయిబా, జమాత్-ఉద్-దవా అధిపతి హఫీజ్ మొహమ్మద్ సయీద్ సూచనల మేరకు రవూఫ్ నేరుగా పనిచేస్తాడు.

2008లో రవూఫ్ లష్కర్ మానవతా సహాయ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. 2003లో పబ్లిక్ సర్వీస్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆగస్టు 2008లో హఫీజ్ సయీద్ ఆదేశం మేరకు,పాకిస్తాన్‌లోని బజౌర్ ప్రాంతంలో సహాయ, నిధుల సేకరణ కార్యకలాపాలను సమీక్షించడానికి రవూఫ్ ఒక బృందానికి నాయకత్వం వహించాడు. ఇది మాత్రమే కాదు, రవూఫ్ లష్కర్ ప్రతినిధిగా కూడా ఉన్నాడు. ఆయన సంస్థ తరపున మీడియాలో, వెబ్‌సైట్‌లలో, ప్రజా వేదికలలో మాట్లాడుతున్నాడు. FIF ద్వారా అతను లష్కర్ కు ప్రజల మద్దతు, నిధులను సేకరించడానికి హై-ప్రొఫైల్ మీడియా ఈవెంట్లను నిర్వహిస్తాడు. డిసెంబర్ 2008లో లష్కర్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో రవూఫ్ లష్కర్, జమాత్-ఉద్-దవా సంక్షేమ కార్యకలాపాల గురించి బహిరంగంగా మాట్లాడాడు, దానిని తన సంస్థ అని పేర్కొన్నాడు.

ఇదారా-ఎ-ఖిద్మత్-ఎ-ఖల్క్‌కు నాయకత్వం వహించాడు

హఫీజ్ రవూఫ్ లష్కర్ స్వచ్ఛంద విభాగం “ఇదారా-ఎ-ఖిద్మత్-ఎ-ఖల్క్” అంటే IKKకి కూడా నాయకత్వం వహించాడు. 2007లో అతను పెషావర్‌కు వెళ్లి, వరద బాధితుల సహాయ చర్యలను పర్యవేక్షించాడు. మే 2004లో జమాత్-ఉద్-దవా సంక్షేమ అధిపతిగా అతను ఒక వైద్య సంస్థ వార్షిక నివేదికను కూడా సమర్పించాడు. IKK, JUD లను 2006 ఏప్రిల్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు సంస్థలుగా అమెరికా గుర్తించింది. హఫీజ్ సయీద్‌ను మే 2008లో ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT)గా ప్రకటించారు. 2008 డిసెంబర్ లో జమాత్-ఉద్-దవాను UN 1267 ఆంక్షల జాబితాలో ఉంచారు. హఫీజ్ అబ్దుల్ రవూఫ్ పై వచ్చిన ఆరోపణలు, ఉగ్రవాద సంస్థలు సేవ పేరుతో ఎలా భయాన్ని వ్యాప్తి చేస్తాయో మరోసారి నిరూపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.