Israel’s Defence: ఇజ్రాయిల్ ఆర్మీలో భారతీయ సంతతికి చెందిన 20 ఏళ్ల యువతి.. గాజా దాడుల్లో పాల్గొన్న నిత్షా

 Israel's Defence: ఏ దేశ రక్షణకైనా ఆర్మీ రంగం ముఖ్యం.. అయితే దక్షిణ కొరియా ఇజ్రాయిల్ వంటి దేశాల్లో యువత తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాలని కఠిన నిబంధనలు అమలు...

Israel's Defence: ఇజ్రాయిల్ ఆర్మీలో భారతీయ సంతతికి చెందిన 20 ఏళ్ల యువతి.. గాజా దాడుల్లో పాల్గొన్న నిత్షా
Gujarath Woman
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2021 | 5:38 PM

Israel’s Defence: ఏ దేశ రక్షణకైనా ఆర్మీ రంగం ముఖ్యం.. అయితే దక్షిణ కొరియా ఇజ్రాయిల్ వంటి దేశాల్లో యువత తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాలని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇజ్రాయిల్ లో అయితే 18 ఏళ్ళు నిండిన యువతీ యువకులకు తప్పని సరిగా నిర్బంధ సైనిక శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ మూలాలున్న ఓ ;యువతి ఇజ్రాయిల్ ఆర్మీల చేరి తన దేశానికి సేవ చేస్తోంది.

గత కొని రోజులుగా ఇజ్రాయిల్, పాలస్తీనాకు చెందిన హమస్‌ ఉగ్రవాద సంస్థకు మధ్య వార్ ఓ రేంజ్ లో నడిచింది. మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తుందా అంటూ అన్ని ఆదేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మెల్లగా పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరోసారి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. తాజాగా ఇజ్రాయెల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌) గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఐడీఎఫ్‌ బృందంలో 20 ఏళ్ల గుజరాత్‌ సంతతి యువతి ఉంది.

ఆ జవాన్ పేరు నిత్షా ములియాషా. నిత్షా పూర్వీకులది రాజ్‌కోట్‌ సమీపంలోని కొఠారీ అనే చిన్న గ్రామం.కొన్ని ఏళ్ల క్రితమే వీరి కుటుంబం ఇజ్రాయెల్ కు వెళ్లారు. నిత్షా కుటుంబం ‘టెల్‌ అవివ్‌’లో స్థిరపడ్డారు. అయితే ఆ దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నిర్బంధ సైనిక శిక్షణ అనే కార్యక్రమంలో భాగం కావాలి. దీంతో నిత్షా రెండేళ్ల క్రితం ఐడీఎ్‌ఫలో చేరిందని నిత్షా తండ్రి జీవాభాయ్‌ ములియాషా చెప్పారు. తన కూతురు లెబనాన్‌, సిరియా, జోర్దాన్‌ సరిహద్దుల్లో పనిచేసిందని, ప్రస్తుతం గాజాలో దాడులు నిర్వహిస్తున్న గుష్‌ దాన్‌ ప్రాంతంలో ఆమె పనిచేస్తోందన్నారు. అయితే ఇజ్రాయెల్‌ దేశంలో 45 గుజరాతీ కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువ మంది వజ్రాల వ్యాపారం చేస్తున్నారు.

Also Read: రైళ్లలో బిచ్చమెత్తుకునే ఓ హిజ్రా.. ఫోటో జర్నలిస్టుగా ఎదిగిన వైనం.. స్ఫూర్తివంతం