Inspiring Story: రైళ్లలో బిచ్చమెత్తుకునే ఓ హిజ్రా.. ఫోటో జర్నలిస్టుగా ఎదిగిన వైనం.. స్ఫూర్తివంతం
Inspiring Story: హిజ్రాలు అంటే సమాజంలో చిన్న చూపుచూస్తారు.. వారు జబర్దస్త్ గా డబ్బులువసూలు చేస్తారని.. అసాంఘిక కార్యక్రలాపాలకు పాల్పడతారని .. రైళ్లల్లో బలవంతంగా..
Inspiring Story: హిజ్రాలు అంటే సమాజంలో చిన్న చూపుచూస్తారు.. వారు జబర్దస్త్ గా డబ్బులువసూలు చేస్తారని.. అసాంఘిక కార్యక్రలాపాలకు పాల్పడతారని .. రైళ్లల్లో బలవంతంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తారని ఎక్కువ మంది భావిస్తారు. మంచివారు, చెడ్డవారు ఆడ,మగ జాతుల్లో ఎలా ఉన్నారో.. హిజ్రాల్లో కూడా మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారని అనేక సంఘటనలు కూడా మనకు రుజువు చేశాయి. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నవారు కూడా ఉన్నారు. ఇక కాంచన సినిమా హిజ్రా నేపథ్యంలో తీసి.. వారు పడే కష్ఠాలు.. తమకంటూ గుర్తింపు కోసం వారు పడే తపన కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే అటువంటి సంఘటన నిజజీవితంలో కూడా ఆవిష్కరించబడింది. అయితే కాంచన సినిమాలో డాక్టర్ చదివితే.. నిజ జీవితంలో ఈమె ఫోటో జర్నలిస్టుగా ఎదిగింది. ఆమే.. ముంబైకి చెందిన జోయా థామస్ లోబో. ఒకప్పుడు రైళ్లలో బిక్షమెత్తుకుని జీవించిన జోయా ఇప్పుడు ఫోటో జర్నలిస్టు అయ్యింది.
జోయా ఒక హిజ్రా.. 5 ఏళ్ల వయస్సులో తండ్రి మరణించడంతో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తల్లి లాలనలో పెరిగింది. ఆమెకు 17 ఏళ్ల వయస్సులో తాను హిజ్రా అని గుర్తించింది. దీంతో సల్మా అనే మహిళ నడుపుతున్న హిజ్రా గ్రూప్‌లో చేరింది. అప్పటి నుంచి బిచ్చగత్తెలా మారి రైళ్లలో బిచ్చమెత్తుకోవడం మొదలు పెట్టింది. అయితే రైళ్లలో జనం ఎక్కువగా ప్రయాణించే పండుగ సమయంలో తినడానికి సరిపడే డబ్బులు వచ్చేవి.. ఆ సమయంలో రోజుకు రూ.500 నుంచి రూ.800 వచ్చేవి. కానీ మిగిలిన రోజుల్లో తినడానికి తిండి దొరికేది కాదు. అయినా జోయా తన జీవితంలో బిచ్చగత్తెగా మిగిలిపోకూడదు అని ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుంది.. తినడానికి తిండి లేకపోయినా తనకు రోజుకి వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత పక్కన పెట్టడం మొదలు పెట్టింది. తనను చేరదీసి సల్మా సహకారంతో 2020లో ఫొటో జర్నలిస్టుగా మారింది. తాను డబ్బును పోగు చేసి రూ.30వేలతో ఓ సెకండ్ హ్యాండ్ కెమెరాను కొనుకుంది.
ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. తాను కొన్న కెమెరాతో వీడియోలు తీస్తూ వాటిని యూట్యూబ్‌లో పోస్టు చేయసాగింది. వాటికి లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆమె శ్రమకు తగిన గుర్తింపు లభించింది. ఆమెకు ఓ మీడియా ఏజెన్సీ వారు ఫొటో జర్నలిస్టు జాబ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తుంది.
మనం ఎలా పుట్టమని కాదు.. ఎలా బతుకుతున్నాం.. ఏమి చేస్తున్నామనేది ముఖ్యమని జోయా చెబుతుంది. తనకు జాబ్ రావడంతో దినచర్యలో అనేక మార్పులు వచ్చాయని.. రోజూ ఉదయాన్నే లేవడం.. కెమెరాతో ఫోటోలు తీసి.. సాయంత్రానికి ఆఫీస్లో అవి అప్పగించడం ఇప్పుడు తనకు సంతోషంగా ఉందని జోయా చెబుతుంది. అంతేకాదు జీవితంలో ఎదగాలనే లక్ష్యం నిర్ధేశించుకుని దానిని సాధించేలా పట్టుదలతో ముందుకు సాగితే .. శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని చెబుతుంది జోయా .
Also Read: రెగ్యులర్ టిఫిన్స్ తో బోర్ కొడుతుందా..అయితే ఓట్స్ తో వెజ్ కిచిడీ ట్రై చేస్తే సరి