AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కువైట్ చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ సాంప్రదాయంలో ఘన స్వాగతం..

రెండు రోజుల పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్‌ చేరుకున్నారు. కువైట్ చేరుకున్న ఆయనకు భారతీయ సాంప్రదాయంతో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ గల్ఫ్ దేశ ముఖ్య నాయకులతో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఇక కువైట్‌లో ఉంటున్న భారతీయులను కలుసుకుంటారు.

PM Modi: కువైట్ చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ సాంప్రదాయంలో ఘన స్వాగతం..
Pm Modi Kuwait Tour
Balaraju Goud
|

Updated on: Dec 21, 2024 | 6:33 PM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం శనివారం (డిసెంబర్ 21) కువైట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కువైట్ చేరుకున్న వెంటనే ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అనంతరం కువైట్ సిటీలో మాజీ ఐఎఫ్ఎస్ అధికారి 101 ఏళ్ల మంగళ్ సేన్ హండాను కూడా ప్రధాని మోదీ కలిశారు.

ప్రధాని మోదీ కువైట్ రాకతో అక్కడ నివసిస్తున్న ప్రవాసాంధ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రధాని నరేంద్ర మోదీ రాక గర్వించదగిన క్షణం. ఇది భారతీయుల పెద్ద విజయం అంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం విశేషం. గతంలో ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. భారతదేశం- కువైట్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయి. రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటనలో ప్రధానాంశంగా ఉంటుందని భారత అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందం కోసం కువైట్‌తో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీ, అబ్దుల్లా అల్ బరూన్, అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను కలిశారు. అబ్దుల్లా అల్ బరూన్ అరబిక్‌లో రామాయణం, మహాభారతాలను అనువదించారు. అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్ రామాయణం, మహాభారతం అరబిక్ వెర్షన్‌లను ప్రచురించారు. మన్ కీ బాత్‌లో కూడా వీరి ప్రయత్నాల గురించి ప్రధాని మోదీ ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..