Akhanda in US: అమెరికాలో నందమూరి ఫ్యాన్స్ రచ్చ.. ఏకంగా 116 కార్లతో ఊహించని రీతిలో..
Akhanda in US: అఖండ ఫీవర్ తెలుగు రాష్ట్రాలనే కాదు.. అమెరికాను కూడా షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. అమెరికాలోని పలు రాష్ట్రాలు, నగరాల్లోనూ బాలకృష్ణ నటించిన అఖండ
Akhanda in US: అఖండ ఫీవర్ తెలుగు రాష్ట్రాలనే కాదు.. అమెరికాను కూడా షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. అమెరికాలోని పలు రాష్ట్రాలు, నగరాల్లోనూ బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలైంది. అఖండ్ ఫీవర్ షికాగో నగరాన్ని కూడా తాకింది. బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడి థియేటర్లు సందడిగా కనిపించాయి.. జై బాలయ్య అంటూ NBK ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు. షికాగో నగరంలో ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లకు పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులు తరలివచ్చారు. ఇక అఖండ చిత్రం రిలీజ్ సందర్భంగా షికాగో నగరంలోని థియేటర్లలో బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేశారు. జై బాలయ్యా అంటూ నినాదాలతో సందడి చేశారు.
ఇక డల్లాస్ నగరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అఖండ్ రిలీజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. డల్లాస్ నగరంలో అభిమానులు భారీ ఎత్తున కార్ ర్యాలీ తీసి, థియేటర్ల దగ్గర సంబరాలు చేసుకున్నారు. ఏకంగా 116 కార్లు ఊరేగింపుగా థియేటర్లకు బయలు దేరాయి.. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు అభిమానులు. అక్కడి వీధులు, థియేటర్లు వీరి కేరింతలతో మార్మోగిపోయాయి. డల్లాస్ సినిమాక్స్ థియేటర్‌లో అభిమానులంతా కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. థియేటర్‌లో తెర వీర బాలయ్య కనిపించగానే కేరింతలు మార్మోగిపోయాయి.. ఆ సందడి చూస్తే అసలు అమెరికాలో ఉన్నామా? ఇండియాలో అనే అనుమానం రాక తప్పదు.
కాగా, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాల తరహాలోనే అఖండ కూడా ఘన విజయం సాధిస్తుందని, రికార్డులు బద్దలు కొడుతుందని ఎన్‌బికే అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
Also read:
Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం