AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI Investments: ఎన్ఆర్ఐల చూపు వాటి వైపే.. భారత్‌లో ఆ రంగాల్లో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు

NRI - HNI Investments in India: భారత్‌లో వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ విభాగంలో ప్రవాస భారతీయులు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులుగా కొనసాగుతున్నారు. దేశంలో

NRI Investments: ఎన్ఆర్ఐల చూపు వాటి వైపే.. భారత్‌లో ఆ రంగాల్లో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు
Nri Investments
Shaik Madar Saheb
|

Updated on: Jan 22, 2022 | 1:02 PM

Share

NRI – HNI Investments in India: భారత్‌లో వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ విభాగంలో ప్రవాస భారతీయులు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులుగా కొనసాగుతున్నారు. దేశంలో హై నెట్ వర్త్ వ్యక్తులు (ఒక మిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు), అల్ట్రా-హై నెట్ వర్త్ వ్యక్తుల (30 మిలియన్ల కంటే ఎక్కువ) (HNI – UHNI) వ్యక్తిగత పెట్టుబడులు, నికర నిల్వలు రోజురోజుకూ పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారతదేశ ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు. దేశంలో ఈకామర్స్ వ్యాపారాల వేగవంతమైన వృద్ధి, వస్తు సేవల అమలు (GST) వంటి క్రమబద్ధమైన సంస్కరణలు మెరుగైన రాబడికి కారణమని.. దీంతో వృద్ధి రేటు పురోగమనం చెందవచ్చంటున్నారు. గతంలో ఎన్‌ఆర్‌ఐలు, హెచ్‌ఎన్‌ఐ వ్యక్తులు సాధారణంగా నివాస, కార్యాలయ ఆస్తులలో పెట్టుబడి పెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని పేర్కొంటున్నారు.

వేర్‌హౌసింగ్‌లో పెట్టుబడి పెట్టడానికి HNIల నుంచి అవిగ్నా గ్రూప్ ఎక్కువ మూలధనాన్ని సేకరించింది. ఈ మేరకు అవిగ్నా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిజిత్ వర్మ మాట్లాడుతూ.. ఈ విభాగం పెరుగుదలతో 8-10% రాబడిని అందిస్తుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రిస్క్ ఉన్నప్పటికీ లాభదాయకంగా ఉందని అభిప్రాయపడ్డారు.

వేరే రంగాల వారు కూడా..

దీంతో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు, రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు కూడా వేర్‌హౌసింగ్ లాజిస్టిక్స్ సెగ్మెంట్‌పై దృష్టి సారించడం ప్రారంభించాయి. ఇది 2022లో మరింత ఆర్థికాభివృద్ధి దోహదపడుతుందంటున్నారు నిపుణులు. దీంతోపాటు ఇ-కామర్స్, థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ (3PL) పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా మరింత వృద్ధిని ఆకర్షించగలదని భావిస్తున్నారు. .

కమర్షియల్‌తో పోల్చితే వేర్‌హౌసింగ్‌పై పెట్టుబడిదారులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారని ల్యాండ్‌మార్క్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు ఆశిష్ జోషి అన్నారు. వేర్‌హౌసింగ్ పెట్టుబడి.. వాణిజ్య పెట్టుబడి కంటే సులభమని అందులో గణనీయమైన లాభాలు కూడా ఉంటాయన్నారు.

మహమ్మారి సృష్టించిన అనిశ్చితి తర్వాత ఇకామర్స్‌ కు డిమాండ్ పెరిగింది. ఇది వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ పరిశ్రమకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం..

వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అదనంగా 4 మిలియన్ చదరపు అడుగుల వేర్‌హౌస్‌ని కలిగి ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నామని వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడి వేదిక అయిన స్ట్రాటా సహ వ్యవస్థాపకుడు సుదర్శన్ లోధా అన్నారు. ఈ విభాగంలో సగటు పెట్టుబడి రూ. 35 లక్షలకు పైనే ఉందన్నారు. FY22 చివరి నాటికి సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తులను (AUM) రూ. 900 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.

వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ పెట్టుబడిదారుల ఆసక్తి ఎందుకంటే.. భాగస్వామ్య ఒప్పందంలో 20% వాటాను కలిగి ఉంది. ఇటీవలి కాలంలో ప్రకటించిన కొన్ని జాయింట్ వెంచర్లతో డేటా సెంటర్లలో పెట్టుబడులు కూడా పుంజుకోవడం ప్రారంభించాయి.

ఈ క్రమంలో వేర్‌హౌసింగ్ పరిమాణాలు 2022లో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కంపెనీలు క్యాపెక్స్ (మూలధన వ్యయం) నుండి ఒపెక్స్ (ఆపరేటింగ్ ఖర్చులు) మోడల్‌కి మారాలని చూస్తున్నాయి. దీంతోపాటు ఐదేళ్ల క్రితం 20,000 చ.అ.ల ఉన్న పెట్టుబడులు ఇప్పుడు 1 మిలియన్ చ.అ.లకు పెరిగాయంటున్నారు వ్యాపార నిపుణులు.

ఈ నేపథ్యంలో వేర్‌హౌసింగ్ విభాగానికి సంబంధించిన లావాదేవీలు 2020-21లో 31.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2022-23లో 45.9 మిలియన్ చదరపు అడుగులకు 20% వార్షిక వృద్ధి రేటు (CAGR)తో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Also Read:

US-Canada Border: సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం బలి.. శిశువు సహా..

Air India: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. భారత్ – యూఎస్‌ విమానాలు రద్దు.. ఎందుకంటే..!