AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dowry to Girls: అక్కడ పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఎదురుకట్నం ఇవ్వాల్సిందే.. ఇంకో క్రేజీ రూల్ కూడా ఉంది

Grooms have to pay dowry to girls: ఒక జంటకు ముడివేయాలంటే.. వధువు, వరుడుకు చెందిన కుటుంబాలు ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుంటాయి. ముఖ్యంగా వరుడుకి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతుంటాయి.

Dowry to Girls: అక్కడ పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఎదురుకట్నం ఇవ్వాల్సిందే.. ఇంకో క్రేజీ రూల్ కూడా ఉంది
Marriage
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2022 | 12:11 PM

Share

Grooms have to pay dowry to girls: ఒక జంటకు ముడివేయాలంటే.. వధువు, వరుడుకు చెందిన కుటుంబాలు ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుంటాయి. ముఖ్యంగా వరుడుకి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. పెళ్లి సంబంధాంల్లో వరుడికి తన ఇల్లు ఉందా.. ఉద్యోగం, జీతం లాంటి విషయాలను వధువు కుటుంబం కచ్చితంగా తెలుసుకుంటుంది. ఆ తర్వాతే వరుడికి ఎంతోకంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ.. ఈ ప్రాంతంలో పిల్లనివ్వాలంటే.. వధువు కుటుంబం వేరే ప్రశ్నలు వేస్తుంది. వారడిగే ప్రశ్నలకు సరైన జవాబు రావడంతోపాటు వరుడు.. వధువుకు కట్నం ఇస్తేనే పిల్లనిస్తారు. అదేంటి వింతగా ఉందనుకుంటున్నారా..? మీరు ఈ వార్త చదవితే మీకే అర్ధమవుతుంది. గుజరాత్‌లోని గాంధీనగర్, మెహ్‌సనా జిల్లాలోని 42 గ్రామాలకు చెందిన పాటిదార్ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే ఎవరైనా (Groom) సరే అమెరికాలో లేదా కెనడాలో (NRI) ఉద్యోగం చేయాలి.. లేకపోతే కనీసం వారి బంధువులైనా అక్కడ నివసిస్తూ ఉండాలి. అంతేకాకుండా అమ్మాయి (Brides) ల కుటుంబసభ్యులకు కట్నం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధాలు (Marriage) చూసేటప్పుడే.. ఈ ప్రశ్నలకు కాదనే సమాధానం వస్తేచాలు.. వెంటనే ఆ సంబంధాలను నిర్మోహమాటంగా వద్దంటారు.

42 గ్రామాల పాటిదార్ కమ్యూనిటీలో ఈ కొత్త పోకడలు తరచూ కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు ఈ ప్రాంతవాసులు. మహిళలు ఎన్నారై హోదా కలిగిన పురుషులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుండగా.. ఇప్పటికే అమెరికాలో స్థిరపడిన పురుషులు అమెరికాలో స్థిరపడిన అమ్మాయిలకు ‘కట్నం’ చెల్లించి పెళ్లి చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. విదేశాలకు వెళ్లేందుకు వీసా రాకపోతే.. అమ్మాయి చట్టవిరుద్ధంగా వలస వచ్చినందుకు ఆమె కుటుంబం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి గ్రామాలలో ఒకటి గాంధీనగర్‌ జిల్లాలోని కలోల్ తాలూకాకు చెందిన డింగుచా అనే గ్రామం. ఇటీవల కెనడా నుంచి అమెరికాకి అక్రమంగా ప్రవేశిస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలా

పెళ్లి చేసుకోవాలని.. డింగుచా నివాసి భవిన్ పటేల్ మాట్లాడుతూ.. మా సమాజంలో ఒక వ్యక్తి యుఎస్‌కు వెళ్లకపోతే లేదా విదేశాలలో బంధువులు లేకుంటే.. అతనికి పెళ్లి సంబంధాలు కుదరడం కష్టమని పేర్కొన్నారు. యుఎస్‌లో స్థిరపడటానికి మార్గం లేనందున అవివాహితులుగా మిగిలిపోయిన చాలా మంది పురుషులు అలానే ఉన్నారన్నారు. కొంతమంది పురుషులు పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ప్రమాదకరంగా చట్టవిరుద్ధమైన మార్గాల్లో యూఎస్, తదితర ప్రదేశాలకు వెళ్ళడానికి ఇది ఒక కారణమని ఆవేదన వ్యక్తంచేశారు.

రూ.20 నుంచి రూ.30 లక్షల కట్నం.. ఈ 42 గ్రామాల్లోని పాటిదార్ సమాజం సభ్యుల ప్రకారం.. US లేదా కెనడాలో నివసిస్తున్న NRI పురుషుల తల్లిదండ్రులు.. ఇప్పటికే అమెరికా లేదా కెనడాలో ఉన్న మహిళలను తీవ్రంగా కోరుకుంటారు. మేము ఈ సమాజంలోని వారితో వివాహం చేసుకోవాలని ఇష్టపడతాం.. కానీ లింగ నిష్పత్తితో చాలా బాధపడుతున్నామమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే విదేశాలలో స్థిరపడిన వారుంటే.. ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అంతేకాకుండా ఒక్కొ సందర్భాల్లో వధువు కోసం వరుడి కుటుంబం అమ్మాయిని అక్రమంగా విదేశాలకు పంపడానికి కట్నంతోపాటు అదనపు డబ్బులను చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొంటున్నారు. ఇది రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉంటుందని మెహసానా జిల్లాలోని కడి తాలూకాలోని కర్జిసాన్ గ్రామానికి చెందిన నీలం పటేల్ పేర్కొన్నారు.

Also Read:

US Froze to Death: కెనడా-అమెరికా సరిహద్దులో చలికి గడ్డకట్టి నలుగురి దుర్మరణం.. గుజరాత్‌కు చెందిన పటేల్ ఫ్యామిలీగా గుర్తింపు!

Yoga Festival: సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే?