Largest Economies: 2050లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న దేశాలు ఇవే.. ఇదిగో వివరాలు

భారత్ 2027-2028 ఆర్థిక ఏడాది నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన పరిశోధనా విభాగం ఎస్‌బీఐ ఎకోరాప్ తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి వాస్తవ జీడీపీ ఆధారంగా చూసుకుంటే 2027 నాటికి ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

Largest Economies: 2050లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న దేశాలు ఇవే.. ఇదిగో వివరాలు
World Map
Follow us
Aravind B

|

Updated on: Jul 30, 2023 | 1:02 PM

భారత్ 2027-2028 ఆర్థిక ఏడాది నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన పరిశోధనా విభాగం ఎస్‌బీఐ ఎకోరాప్ తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి వాస్తవ జీడీపీ ఆధారంగా చూసుకుంటే 2027 నాటికి ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 2014 నాటితో పోలీస్తే 7 స్థానాలకు ఎగబాకుతుందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదికి సంబంధించి జీడీపీ 6.5 శాతానికి పెరుగుతుందని ఎస్‌బీఐ ఆర్థిక నిపుణులు తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి 0.75 ట్రిలియన్ డాలర్ల పెరిగడంతో 2047 నాటికి ఇండియా 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఎకోరాప్ నివేదిక పేర్కొంది. అలాగే 2027 నాటికి అంతర్జాతీయ జీడీపీలో ఇండియా వాటికి 4 శాతం దాటుతుందని తెలిపింది. అయితే ఇప్పుడు ప్రపంచ జీడీపీలో ఇండియా వాటా 3.5 శాతంగా ఉందని పేర్కొంది.

2027లో దేశంలోని కొన్ని కీలక రాష్ట్రాల జీడీపీ.. నార్వే, వియాత్నాం లాంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా గ్లోబల్ ఇండెక్స్‌ కూడా భవిష్యత్తులో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై కీలక సర్వే చేసి పలు విషయాలు బయటపెట్టింది. 2050 నాటికి ప్రపంచలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల పేర్లను వెల్లడించింది. అందులో మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. ఇక మూడో స్థానాన్ని భారత్ దక్కించుకుంది. నాలుగో స్థానంలో ఇండోనేషియా, ఐదు జర్మనీ, ఆరు జపాన్, ఏడు యూకే, ఎనిమిది బ్రెజిల్, తొమ్మిది ఫ్రాన్స్, ఇక పదవ స్థానంలో రష్యా నిలిచింది. అయితే 2027-28 నాటికే భారత్ అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఎస్‌బీఐ ఎకోరాప్ తెలుపగా.. గ్లోబల్ ఇండెక్స్‌ నివేదికలో కూడా 2050 కి భారత్ మూడవ స్థానంలో ఉంది. అయితే 2027 నుంచి 2050 వరకు భారత్ మూడవ స్థానంలో ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మరికొంతమంది 2050 నాటికి భారత్ రెండో స్థానానికి చేరుకుందని అంటున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది