Crisis: ధరల పెంపుతో నడ్డివిరిచిన ప్రభుత్వం.. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ పై ఏకంగా 52 శాతం పెంపు

భారత్ కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh) లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితులే ఇక్కడా రిపీట్ అవడం ఆందోళన కలిగిస్తోంది. సింహళ దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఎంతటి పరిణామాలకు దారి తీసిందో...

Crisis: ధరల పెంపుతో నడ్డివిరిచిన ప్రభుత్వం.. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ పై ఏకంగా 52 శాతం పెంపు
Fuel Price
Follow us

|

Updated on: Aug 08, 2022 | 9:17 PM

భారత్ కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh) లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితులే ఇక్కడా రిపీట్ అవడం ఆందోళన కలిగిస్తోంది. సింహళ దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఎంతటి పరిణామాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే.. తాజాగా అక్కడ ఇంధన ధరలు ఒక్కసారిగా 52 శాతం పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ స్థాయిలో ఎన్నడూ ఇంధన ధరలు (Fuel Prices) పెరగకపోవడం గమనార్హం. ఇలా భారీ స్థాయిలో ధరలను పెంచడంతో షేక్‌ హసీనా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. పెట్రోల్‌ ధర లీటరుకు ఒకేసారి 51.2శాతం అదనంగా అక్కడి కరెన్సీలో 44 టాకాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. తాజా పెంపుతో బంగ్లాదేశ్ లో లీటరు పెట్రోల్‌ ధర 130 (109.2 ఇండియన్ రూపాయలు) టాకాలకు చేరింది. లీటరు డీజిల్‌పై 34 టాకాలు, ఆక్టేన్‌పై 46 టాకాలు పెంచింది. కిరోసిన్‌ పై 42 శాతం పెరిగింది.

ప్రభుత్వం ఇలా భారీగా ఇంధన ధరలను ఒక్కసారిగా పెంచడంతో బంగ్లాదేశ్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలూ పెరిగాయి. తాజాగా బస్సు ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు ఆపరేటర్లు ప్రకటించారు. ధరల మంటతో అతలాకుతలమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కాగా.. ప్రభుత్వం మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే పెంచినట్లు చెప్పడం గమనార్హం. ఇదిలాఉంటే, 416 బిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ కలిగిన బంగ్లాదేశ్‌ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.

కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో శ్రీలంకలోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచింది. దీంతో అక్కడి ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ ధరల పెంపుతో ఆ దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.338కి చేరింది. లీటర్‌ పవర్‌ పెట్రోల్‌ ధర రూ.373 పెరిగింది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరలు, డాలర్‌తో శ్రీలంక రూపాయి క్షీణత ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి