French President: ఎందుకు మేడం సార్‌పై అంత గుస్సా.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌కు చేదు అనుభవం
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌పై ఆయన భార్య చేయి చేసుకున్నారా..? వైరల్ అవుతున్న దృశ్యాలు చూస్తే.. అది నిజమే అనిపిస్తుంది. వియత్నాంలోని హనోయ్ పర్యటనలో ఉన్న దంపతులు సరిగ్గా విమానం దిగుతుండగా ఈ ఘటన జరిగింది. తర్వాత ఆయన కిందకు దిగుతున్న క్రమంలో భార్య చేతిలో చేయి వేసేందుకు నిరాకరించింది.

పబ్లిక్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడి పరువుపోయింది. వియత్నాం పర్యటనకు హనోయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగడానికి కొన్ని క్షణాలముందు భార్య ఆయనపై చేయిచేసుకుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దంపతులు విమానం దిగబోయే ముందు ఏమైందో ఏమో.. భర్త మొహాన్ని చేతులతో నెట్టేసింది బ్రిగిట్టే. స్టెప్స్ దిగుతున్నప్పుడు భర్త చేయి అందించినా సీరియస్‌గా ఉండిపోయారు మేక్రాన్ సతీమణి. వరల్డ్‌వైడ్ వైరల్ అయింది ఈ ఇన్సిడెంట్.
⚠️ #BreakingNews (but also kind of slapping):
In a plot twist no one saw coming — not even Macron — the French President Emmanuel #Macron's husband slapped him in the face. 🤭
Macron's reaction after being slapped. 😷 pic.twitter.com/N83VerFQJ9
— ArshadAyyub (@mgarshad142) May 26, 2025
పరువు పోవటంతో అబ్బే మా ఆవిడ నన్ను కొట్టలేదని వివరణ ఇచ్చుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. తామిద్దరం సరదాగా అప్పుడప్పుడూ అలా గొడవపడుతుంటామనేది మేక్రాన్ వెర్షన్. నమ్మొచ్చంటారా. అసలే మొగుడూ పెళ్లాల గొడవ. ఏం చెప్పినా నమ్మేయాల్సిందే.
అబ్బ నీ కమ్మనీ దెబ్బా అనుకోడానికి అదేం రొమాంటిక్ సీన్ కాదు. పరువుపోయే వ్యవహారం. అదే దిగేటప్పుడు కొట్టుంటే.. ఆ మెట్లమీంచి జారుకుంటూ కిందపడితే ఏ పుత్తూరు కట్టో వేయాల్సి వచ్చేది. ఎంతవారలైనా కాంతాదాసులే అనే మాట పాపులరేగానీ.. ఎంతవారలైనా భార్యా బాధితులేనని పాపం ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌ని చూశాకే అందరికీ లైవ్‌లో తెలిసొచ్చింది.
అదేదో విమానం గాల్లో ఉండగా జరిగుంటే మొగుడూపెళ్లామ్స్ మధ్యే ఉండిపోయేది. సరిగ్గా ఆ టైంలోనే మేడమ్ మూడాఫ్ ఎందుకైందో.. ఫ్లైట్ డోర్ తెరుచుకుని కిందికి దిగే టైంకి చేయి పైకిలేచింది. భర్త మొహాన్ని తాకింది. టైమింగ్ కాస్త తేడాకొట్టినట్లుంది. లేకపోతే గూబ గుయ్యిమనేదే. కొట్టాలనుకుందో, కోపంతో మొహాన్ని తోసేసిందోగానీ.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ బయట పులి ఇంట్లో పిల్లి అనే సీక్రెట్ ప్రపంచమంతా తెలిసిపోయింది.
అక్కడితోనే ఆగలేదు అవమానం. మొగుడూపెళ్లాలన్నాక సవాలక్ష గొడవలుంటాయి. కానీ బయటికొస్తే చిలకాగోరింకల్లా, లైలా మజ్నూల్లా, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపించాలి. కానీ ఫ్రాన్స్ ఫస్ట్ లేడీ కోపం ఇంకా చల్లారలేదేమో. పతిదేవుడు చేతిలో చెయ్యేసి నడిచేందుకు సిద్ధపడ్డా…చాలు చాల్లే నీ పక్కన నడవడమే ఎక్కువన్నట్లు విసవిసా దిగేసింది. చేసేది లేక మళ్లీ చేయి సవరించుకున్నాడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.
పదేళ్ల తర్వాత ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటిస్తున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈ టూర్‌లో భాగంగా వియత్నాం రాజధాని హనోయిలో అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మేక్రాన్ దంపతులు దిగడానికి కొన్ని క్షణాల ముందు జరిగిందీ సంఘటన. డోర్ ఓపెన్ అయ్యే సమయానికి భర్త మేక్రాన్ మొహంమీద మిసెస్ ప్రెసిడెంట్ బ్రిగిట్టే రెండు చేతులతో కొట్టిన సీన్ కనిపించింది. దిగేటప్పుడు పట్టుకోమని భార్యకు తన చేతిని అందించబోయారు మేక్రాన్. కానీ మేడమ్ ససేమిరా అనటంతో ఏడవలేక నవ్వుతున్నట్లు మొహం పెట్టేశారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్.
కొట్టింది పెళ్లాంకాబట్టి ఓకే. కానీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్‌కి ఇదివరకు బయట కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. జనంతో కరచాలనం చేయడానికి పరుగుపరుగున వెళ్లిన మేక్రాన్‌ని.. ఆ అవకాశంకోసమే చూస్తున్నట్లు చాచి చెంపమీద కొట్టాడో వ్యక్తి.
పబ్లిక్‌లో ఎవరన్నా కొడితే సింపథీ అన్నా ఉంటుంది. మరీ అంత పెద్ద ప్రెసిడెంట్‌ని పట్టుకుని పెళ్లాం కొట్టడమేంట్రా బాబూ అనుకుంటున్నారంతా. ఈ మ్యాటర్ వరల్డ్‌వైడ్ వైరల్ కావటంతో అబ్బే వైఫ్ నన్ను కొట్టలేదని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వివరణ ఇచ్చుకున్నారు. అప్పుడప్పుడూ కపుల్స్ సరదాగా అలా గొడవపడుతుంటారట. నమ్మొచ్చంటారా.. రేప్పొద్దున ఏదన్నా కట్టుతో కనిపించినా బాత్రూంలో కాలు జారానని చెప్పుకుంటాడేమో పాపం..
మరిన్ని అంతర్జాతయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
