ఏం మనుషులురా మీరు.. పీరియడ్స్ అని సెలవు అడిగితే .. రుజువు చూపించాలంటూ యూనివర్సిటీ డిమాండ్..
వివాదం తీవ్ర రూపం దాల్చటంతో, విశ్వవిద్యాలయం సిబ్బందిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది నిబంధనల ప్రకారం పనిచేశారని చెప్పింది. ఈ నిబంధన చాలా కాలంగా అమలులో ఉందని, విద్యార్థులు సెలవులను దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం తెలిపింది.

ఒక విద్యార్థిని తనకు పీరియడ్స్ సెలవు కావాలని కోరటంతో..సంబంధిత విశ్వవిద్యాలయం ఆమె బట్టలు విప్పేసి రుజువు చూపించమని కోరింది. ఈ దారుణ సంఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. చైనాలోని బీజింగ్‌లోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం మహిళా విద్యార్థులకు వారి రుతుక్రమ సెలవు ఇవ్వాలంటే సరైనా ఆధారం చూపించాలని డిమాండ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన గెంగ్డాన్ ఇన్స్టిట్యూట్‌లో జరిగింది. మే 15న ఒక విద్యార్థి తన అనుభవాన్ని వివరిస్తూ ఆన్‌లైన్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ఈ సంఘటన తర్వాత విశ్వవిద్యాలయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెలువు కావాలంటే సదరు విద్యార్థిని క్యాంపస్ క్లినిక్‌లో బట్టలు విప్పి పరీక్ష చేయించుకోవాలని కోరినట్టుగా బాధిత యువతి వీడియోలో ఆరోపించింది. వీడియోలో ఆ విద్యార్థిని పిరియడ్స్ సమయంలో అందరూ బట్టలు విప్పి రుజువు చూపించాల్సిన అవసరం ఉందా అని సిబ్బందిని అడిగినట్టుగా చెప్పింది.. అందుకు సిబ్బంది నుంచి అవును అనే సమాధానం వచ్చిందని, ఇది కళాశాల నియమం అని తనది కాదంటూ సిబ్బంది చెప్పిన విషయాన్ని బాధిత యువతి వెల్లడించింది. ఇందుకు గానూ ఆ విద్యార్థిని ఇలాంటి రూల్స్‌కి సంబంధించి లిఖిత పూర్వ కాపీని ఇవ్వమని అడిగితే.. సిబ్బంది ఇవ్వలేదని చెప్పింది. తనకు ఎదురై ఇలాంటి అనుభవాన్ని బాధిత యువతి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. దీంతో వీడియో వైరల్‌గా మారింది. ఇంటర్‌నెట్ వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది.
వివాదం తీవ్ర రూపం దాల్చటంతో, విశ్వవిద్యాలయం సిబ్బందిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది నిబంధనల ప్రకారం పనిచేశారని చెప్పింది. ఈ నిబంధన చాలా కాలంగా అమలులో ఉందని, విద్యార్థులు సెలవులను దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




