Fire Accident: అగ్రరాజ్యంలో ఎగిసిపడ్డ మంటలు.. కాలి బూడిదైన బస్సులు, పలు వాహనాలు..
Fire Accident In America: అగ్రారాజ్యం అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలకు భారీగా వాహనాలు కాలి బూడిద అయ్యాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది...
Fire Accident In America: అగ్రారాజ్యం అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలకు భారీగా వాహనాలు కాలి బూడిద అయ్యాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్‌ఏంజెల్స్ కౌంటీలో ఉన్న ఓ యార్డ్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో యార్డ్‌లో ఉన్న కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతి అయ్యాయి. క్షణాల్లో యార్డ్ మొత్తం మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా.. మంటలు అదుపులోకి రావట్లేదు. ఇదిలా ఉంటే భారీగా చెలరేగిన మంటల కారణంగా కరెంట్ స్థంభాలు కాలిపోవడంతో సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న దాదాపు 150కిపైగా గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా ఉన్న అపార్ట్‌మెంట్‌లకు కూడా అగ్ని వ్యాపించే ప్రమాదం ఉండడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఇక అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Air Strikes: సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. ఇది ఇరాన్‌కు హెచ్చరిక: జో బైడెన్